– రామగుండంలో 40 వేల ఇళ్లకు నళ్లా ద్వారా సురక్షితమైన త్రాగునీరు
– ప్రతి ఇంటికి శుద్ధి చేసిన త్రాగునీరు అందించడమే పథకం లక్ష్యం
– రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్
(పజాలక్ష్యం విలేకరి – రామగుండం నియోజకవర్గం)
సెప్టెంబర్ 1: మహిళల మంచినీటి కష్టాలను తొలగించేందుకు మిషన్ భగీరథ పథకం లక్ష్యం మని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. మంగళవారం గోదావరిఖని పట్టణంలోని సి.ఎస్.పి కాలనీలోని మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల మంచి నీటికి కష్టాలు పడవద్దని ప్రతి ఇంటికి నళ్లా ద్వారా శుద్ధి చేసిన త్రాగునీరు అందించడమే మిషన్ భగీరథ పథకం లక్ష్యమన్నారు. రామగుండం కార్పోరేషన్ ప్రాంతంలో 40వేల ఇళ్లకు సురక్షితమైన గోదావరినీరు అందించండం జరగుతుందని తెలిపారు. 24గంటలు త్రాగునీరు అందించేం దుకు ప్రణాళికలతో ముందుకు సాగుతున్నాయన్నారు. గతంలో వెసవికాలంలో ఆడపడు చులు త్రాగునీరు కోసం బిందెలతో ట్యాంకులు, బోర్లవద్ద ఇబ్బందులు పడుతుండేవారని చెప్పారు. త్రాగునీరు కోసం బిందెలతో ధర్నాలు, పోరాటాలు చేసేవారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సిఎం కేసీఆర్ మహిళల కష్టాలను రూపుమాపేందుకు మిషన్ భగీరథ పధకం ద్వారా ప్రతి ఇంటికి స్వచ్చ జలం అందించడం జరుగుతుందన్నారు. 90 కోట్లతో 13 ట్యాంకులను నిర్మాణం చేయడం జరిగిందన్నారు. రామగుండం కార్పోరేషన్లో 9 కోట్ల నిధులతో లికేజ్ పనులను పూర్తి చేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, డిప్యూటి మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు, నగర కమీషనర్ ఉదయ్ కుమార్, కార్పోరేటర్లు సాగంటి శంకర్, దాతు శ్రీనివాస్, పాముకుంట్ల భాస్కర్, అడ్డాల గట్టయ్య, నాయకులు పాతపెల్లి ఎల్లయ్య, తోడేటి శంకర్ గౌడ్, జే.వి.రాజు, బోడ్డు రవీందర్, ఇరుగురాళ్ల శ్రావన్, అబ్బాస్, అనిల్, శ్రీకాంత్, శ్రీనివాస్, విజయ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.