Home తెలంగాణ సింగరేణిలో 18 మందికి డిపెండెంట్ ఉద్యోగాలు…

సింగరేణిలో 18 మందికి డిపెండెంట్ ఉద్యోగాలు…

660
0
employement orders
G.M. K.Narayana issuing employment orders to dependents

– నియామకపు ఉత్తర్వులు అందజేసిన ఆర్జీవన్ జియం కె.నారాయణ

(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, అక్టోబర్ 15: పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి ఆర్జీవన్‌ ఏరియాలో కారుణ్య నియామకాల ద్వారా 18 మంది డిపెండెంట్లకు ఉద్యోగాలు కల్పించినట్లు జియం కె.నారాయణ తెలిపారు. ఈ మేరకు గురువారం రోజున జియం కార్యాలయంలో నియామక ఉత్తర్వులను డిపెండెంట్లకు అంజేశారు.

ఈ సందర్బంగా జియం కె. నారాయణ మాట్లాడుతూ సింగరేణి సంస్థలో పనిచేస్తూ వివిధ ఆనారోగ్య కారణాలతో మెడికల్‌ ఇన్‌వాలిడేషన్‌ పొందిన ఉద్యోగుల వారసులగు 18 మందికి సంస్థలో ఉద్యోగాలు కల్పించినట్లు తెలిపారు. చాలా తక్కువ సమయంలో 18 మందికి మెడికల్‌ ఇన్వాలిడేషన్‌ ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగిందని పేర్కొన్నారు. వీరందరికి అడ్రియాల లాంగ్‌ వాల్‌ ప్రాజెక్టులో పోస్టింగ్‌ ఇవ్వటం జరిగిందని తెలిపారు.

employment orders
G.M. K.Narayana issuing employment orders to dependents

ఉద్యోగ అవకాశాలు పొందుతున్న వీరంతా ఇప్పుడున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుకూలంగా పని నైపుణ్యాన్ని మెరుగు పరుచుకొనుటకు విటిసిలో శిక్షణ తీసుకోవా లన్నారు. సంస్థ సీనియర్‌ ఉద్యోగుల వద్ద పనితనపు మెళవకులు నేర్చుకోవాలన్నారు. రక్షణతో కూడిన ఉత్పత్తి దోహదపడి సంస్థ పురోభివృద్ధికి పాడుపడాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో పర్సనల్‌ మేనేజర్‌ యస్‌. రమేష్‌, జి.యం. ఆఫీస్ ఇంచార్జి ప్రవీణ్, డిప్యూటి పర్సనల్ మేనేజర్ సమ్మయ్య,  మళ్లీశ్వరీ, అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here