– ఆరోగ్య తెలంగాణకై ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిషలు కృషి
– రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని ఏప్రిల్, 11: తెలంగాణలోని ప్రజలందరి దృష్టి లోపాలను నివారించడమే లక్ష్యంగా ముఖ్య మంత్రి కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమం తీసుకురావడం జరిగిందని రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్ అన్నారు. మంగళవారం రామగుండం కార్పోరేషన్ పరిధిలోని 34 వ డివిజన్‌లో కంటి వెలుగు శిభిరాన్ని ఎమ్మెల్యే స్వయంగా పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సిఎం కేసీఆర్ ప్రజహిత సంక్షేమ పధకాలను విజయవంతంగా అమలు చేస్తున్నారన్నారు. కంటి వెలుగు తెలంగాణ రాష్టంలో కంటిచూపు సమస్యలతో బాధపడుతున్న ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఈ పథకం రూపుదిద్దుకుందన్నారు.
ఈ పథకాన్ని ప్రభుత్వ ఖర్చుతో ఉచితంగా తెలంగాణలోని అన్ని జిల్లాల ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించి, కళ్లద్దాలు, అవసరమైన వారికి శస్త్రచికిత్సలు, మందులను అందజేస్తుందన్నారు. 18 సంవత్సరాల దాటిన వారి నుండి పండు ముసలి వరకు కంటి వెలుగులో కళ్ల పరీక్షలు చేయుంచు కోవచ్చన్నారు. కార్పోరేట్ ఆసుపత్రి తరహాలో కంటి వెలుగులో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారని, ప్రజలంతా ఈ ఆవకాశన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కార్పోరేటర్ జంజర్లమౌనిక, జే.వి.రాజు, దొంత శ్రీనివాస్, నాయకులు దొమ్మెటి వాసు, వైద్యురాలు నర్మాదా, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు