Home తెలంగాణ విద్య, వికాసమే వివక్షతకు విరుగుడు

విద్య, వికాసమే వివక్షతకు విరుగుడు

624
0
Education and development is the antidote to discrimination
Ramagundam MLA Korukanti Chander speaking on Pule Jayanthi meeting at Godavarikhani

– అణగారిన వర్గాల కోసం పాటుపడిన జ్యోతిరావు పూలే
– పూలే ఆశయాలకు అనుగుణంగా సిఎం కేసీఆర్‌ పాలన
– రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్‌

(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని ఏప్రిల్‌, 11: విద్య, వికాసమే అన్ని వివక్షతలకు విరుగుడని, దాని కోసం పాటుపడిన జ్యోతిరావు పూలే ధన్యుడని, ఆయన ఆశయాలకు అనుగుణంగా మానవాళి ముందుకు సాగినప్పుడే ఆయనకు మనమిచ్చే నిజమైన నివాళని రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్‌ పేర్కొన్నారు. బుధవారం మహనీయుల జయంతి ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే 197వ జయంతిని పురస్కరించుకుని ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ఎమ్మెల్యే చందర్‌ ముఖ్యఅతిథిగా హాజ రయ్యారు. ముందుగా స్థానిక రాజేష్‌ థియేటర్‌ సమీపంలోని పూలే విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… ముఖ్యమంత్రి కేసీఆర్‌ జ్యోతిరావు పూలే ఆశయాలకు అను గుణంగా పాలనను కొనసాగిస్తున్నారనని చెప్పారు. అణగారిన బడుగు బలహీన వర్గాల అభివృద్ధి, సంక్షేమ కోసమే మహాత్మ జ్యోతిరావు పూలే ఎంతగానో కృషి చేశారని పేర్కొన్నారు. జ్యోతిరావు పూలే ఒక సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక విప్లవకారుడు అని కొనియాడారు.

MLA Koruknati Chnder
MLA Korukanti Chander floral tributes to the statue of Phule.

రామగుండం పారిశ్రామిక ప్రాంతం చైతన్యానికి ఉద్యమాలకు పురిటి గడ్డ అని అన్నారు. ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు నుంచి ఎన్నో ప్రజాసేవ కార్యక్రమాలను నిర్వహించినపుడు కలిగిన ఆత్మసంతృప్తి… పారిశ్రామిక ప్రాంతంలో మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేసినప్పుడు అంతే ఆత్మ సంతృప్తి కలిగిందన్నారు. రాష్ట్రంలోని దళిత బహుజనులు ఉన్నతమైన జీవితాన్ని పొందే విధంగా ముఖ్యమంత్రి పథకాలు చేపడుతున్నారని అన్నారు. మహనీయుల చరిత్రను భావితరాలకు తెలిసే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని, అదేవిధంగా వారి విగ్రహాల ప్రతిష్టాపన, జయంతి కార్యక్రమాలను నిర్వహిం చాలని పిలుపునిచ్చారు. సామాజిక అసమానతలను, దురాచాలను దూరం చేయాలంటే విద్యే ఏకైక మార్గమని నమ్మిని వ్యక్తి మహాత్మా జ్యోతిరావు ఫూలే అని పేర్కొన్నారు.

బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడిన ఉద్యమకారుడు పూలే అని అభివర్ణించారు. జ్యోతిరావు పూలే జాతి విముక్తి కోసం, కుల వివక్షత కోసం కార్యచరణతో ముందుకు సాగిన మహనీయుడుగా చరిత్రలో నిలిచారన్నారు. చదువును లింగ వర్ణ తేడా లేకుండా అందరు పొందే హక్కు అని భావించిన ఏకైక వ్యక్తి జ్యోతిరావు పూలే అని కొనియాడారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ జ్యోతిరావు పూలేని తన గురువుగా చెప్పుకున్నారని ఎమ్మెల్యే తెలిపారు. అంబేద్కర్‌ రచించిన రాజ్యాంగంతోని భారత ప్రజానీకం స్వేచ్ఛ వాయువులో జీవనం సాగిస్తుందన్నారు. డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ 125 అడుగుల విగ్రహాన్ని ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏర్పాటు చేయడంలోనే బడుగు బలహీన వర్గాల పై ఆయనకు ఉన్న చిత్తశుద్ధి అర్థం అవుతుందని ఎమ్మెల్యే అన్నారు.

MLA Korukanti Chander
MLA Korukanti Chander floral tributes to the statue of Phule.

60ఏండ్లలో లేని అభివృద్ధి, సంక్షేమం కేవలం ఎనిమిది ఏళ్లలో ప్రతి ఇంటికి అభివృద్ధితో కూడిన సంక్షేమం ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేరవేస్తున్నారని అన్నారు. మహిళలు అన్ని రంగాల్లో ఎదగాలని ఆయన కోరారు. మహనీయుల ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగినప్పుడే వారికి నిజమైన నివాళులర్పించడం అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో మహనీయుల పక్షోత్సవ, వారోత్సవాల కార్యక్రమాల నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఏసిపి గిరి ప్రసాద్‌, మున్సిపల్‌ కమీషనర్‌ సుమన్‌ రావు, రాష్ట్ర నాయకురాలు మూల విజయ రెడ్డి, టిబిజికెఎస్‌ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెంగార్ల మల్లయ్య, మధ్యప్రదేశ్‌ ప్రభుత్వ కార్యదర్శి పరికిపండ్ల నరహరి, కార్పొరేటర్లు కలువల శిరీష-సంజీవ్‌, మంచికట్ల దయాకర్‌, కో ఆప్షన్‌ వంగ శ్రీనివాస్‌ గౌడ్‌, బిఆర్‌ఎస్‌, టిబిజికెఎస్‌ నాయకులు తోడేటి శంకర్‌ గౌడ్‌, తానిపర్తి గోపాల్‌ రావు పర్లపల్లి రవి, మేడి సదానందం, అచ్చ వేణు, నారాయణదాసు మారుతీ, మెతుకు దేవరాజ్‌, నడిపల్లి మురళిధర్‌ రావు, పిఎస్‌ అమరేందర్‌, నూతి తిరుపతి, చల్ల రవీందర్‌ రెడ్డి, ఆడప శ్రీనివాస్‌, వడ్డేపల్లి శంకర్‌, మైస రాజేష్‌, జెవి రాజు, జిట్టావేణి ప్రశాంత్‌, బెండే నాగభూషణ్‌ గౌడ్‌, కాలువ శ్రీనివాస్‌, నీలారపు రవి, దాసరి ఎల్లయ్య, పిల్లి రమేష్‌, ముక్కెర రాజేశం, కాయిత శ్రీనివాస్‌, కాంపెల్లి సతీష్‌, పిచర శ్రీనివాస్‌, అయిలి శ్రీనివాస్‌, అందే సదానందం, బొంకూరి మధు, మాదాసు రామ్మూర్తి, కొంకటి లక్ష్మణ్‌, కోడి రామకృష్ణ, కేక్కర్ల సతీష్‌, కొర్రి ఓదెలు, బిక్షపతి, గోవర్ధన్‌, దేవి లక్ష్మినారాయణ, ఈదునూరి శ్రీకాంత్‌, చింటు, పట్ల మధు, పర్లపల్లి బాబురావు, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here