– జిల్లా కలెక్టర్ కె.శశాంక
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
కరీంనగర్, సెప్టెంబర్ 28: డయల్ యువర్ కలెక్టర్‌కు వచ్చే ప్రజా సమస్యలను ప్రతీదీ పరిష్కరించాలని, నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని కలెక్టర్ కె.శశాంక హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశం మందిరంలో అన్ని శాఖల అధికారులతో సమావేశమై డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు ఎంతో ఆశతో తమ సమస్యలు పరిష్కారం అవుతాయనే ఉద్దేశ్యంతో డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమంలో ఫోను ద్వారా తెలుపుతారని, ప్రజా సమస్యలను ప్రతీది పరిష్కరించాలని అన్నారు. డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం లో జిల్లా అధికారులు తమ శాఖకు సంబంధించిన సమస్యలు ప్రజలు తెలిపినపుడు ప్రాధాన్యమిచ్చి వెంటనే నోటు చేసుకొని వారం రోజుల్లో సమస్యను పరిష్కరించి వారికి లేఖ ద్వారా తెలియజేయాలని అన్నారు.
ఈ సందర్భంగా కొత్తపెల్లి నుండి కిరణ్ కుమార్ ల్యాండ్ కొరకు 2007 లో కోర్టు ద్వారా ఉత్తర్వు తెచ్చుకున్నాను. నా పేరు మీద మ్యూటేషన్ ఇంతవరకు కాలేదని, చనిపోయిన వ్యక్తిపై మ్యూటేషన్ అయి ఉన్నదని ఆయన ఫిర్యాదు చేశారు. పరిశీలించిన వెంటనే పరిష్కరిస్తామని ఆయన తెలిపారు.
జమ్మికుంట మండలం నుండి రవి 2019 పాఠశాలపై కాంప్లెంట్ చేసినాను, విద్యార్థుల స్కూలు బ్యాగులు, పుస్తకాలు బయట వేస్తున్నారని ఫిర్యాదు చేశారు, స్కూల్ రెంట్ రాలేదని కోవిడ్ ఉన్నందున పరిశీలించలేకపోయామని, వెంటనే పరిశీలించి పరిష్కరిస్తామని డి.ఈ.వో. తెలిపారు.
తిమ్మాపూర్ మండలం నుండి రాములు మహాత్మనగర్ గ్రామ పంచాయితీ నుండి ఉన్న డ్రైనేజీ ని తొలగించి వేరే వైపు నుండి కొత్తగా నిర్మిస్తున్నారు. మురికి నీరు ఆగి ప్రజలకు ఇబ్బంది జరుగుతున్నదని ఆయన ఫిర్యాదు చేశారు. డి.పి.వో. గారు వెంటనే పరిశీలించి పరిష్కరిస్తామని తెలిపారు.
కరీంనగర్ నుండి ఖాజా మోహినోద్దీన్ ఎం.బి.ఏ. విద్యా పూర్తి చేసినానని, నాకు ఉద్యోగం ఇప్పించాలని, నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని ఫిర్యాదు చేశారు, వారధి లో ధరఖాస్తు చేసుకొవాలని అవకాశం ఉన్నప్పుడు ఉద్యోగం ఇప్పిస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు. అలాగే నాగ చౌరస్తా నుండి అన్ని రోడ్లు బాగుగా లేక రోడ్డు పై గుంతలు ఉన్నావని ఫిర్యాదు చేయగా ఆర్ అండ్ బి వారు పరిశీలించిన వెంటనే పరిష్కరిస్తామని ఆయన తెలిపారు.
వావిలాల నుండి వరలక్ష్మీ మరుగుదొడ్డు, బాత్ రూమ్ నిర్మించుకున్నాము, మేము ధరఖాస్తు చేసుకున్నామని మాకు ఇంత వరకు సాంక్షన్ కాలేదని ఫిర్యాదు చేశాము, పరిశీలించిన వెంటనే పరిష్కరిస్తామని ఆయన అన్నారు.
డయల్ యువర్ కలెక్టరేట్ లో భాగంగా వచ్చిన ఫిర్యాదులు పోలిస్ కమిషనర్, కరీంనగర్ కు 1, ఏడిఎస్‌ఎల్‌ఆర్. 1, మున్సిపల్ కమిషనర్, కరీంనగర్ కు 5, ఎస్‌ఈఎన్‌పిసిఎల్. 2, ఈడిఎస్‌సి. కార్పొరేషన్ 1, ఈఈ ఆర్ అండ్ బి. 2, డిస్ట్రిక్ట్ బిసి డెవెలప్ మెంట్ ఆఫీసర్, కరీంనగర్ 1, జిల్లా విద్యాధికారికి 3, పంచాయతి అధికారులకు 5, జిల్లా లెబర్ ఆఫీసర్ 1, జిల్లా మార్కెటింగ్ ఆఫీసర్ 1, డిస్ట్రిక్ట్ రూరల్ డెవలెప్ మెంట్ ఆఫీసర్ 3, సివిల్ సప్లైస్ అధికారులకు 1, డిస్ట్రిక్ట్ ట్రెజరీ ఆఫీసర్ 1, ఆర్.డి.వో. హుజురాబాద్ 2, డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ 1, కరీంనగర్ తహశీల్దార్ కు 2, తహశీల్దార్ హుజురాబాద్ కు 1, కరీంనగర్ రూరల్ తహశీల్దార్ కు 1, తహశీల్దార్ వీణవంక కు 2, వారధీ సోసైటీకి 2 మొత్తం ఫిర్యాధులు 39 వచ్చినందున వాటిని సంబంధిత శాఖలు పరిష్కరించాలని అన్నారు.
ఈ కార్యక్రమం లో అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్, డి.ఆర్.డి.వో. వెంకటేశ్వర్ రావు, డి.ఆర్.వో, వెంకట మాధవ రావు, జిల్లా పంచాయతి అధికారి బుచ్చయ్య, జిల్లా విద్యాధికారి శ్రీనివాస్, కలెక్టరేట్ పరిపాలనా అధికారి లక్ష్మారెడ్డి, కలెక్టరెట్ సూపరింటెండెంట్లు మాధవి, పారుక్ జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.