– రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని అక్టోబర్ 7: తెలంగాణ రాష్ట్రంలోని ముస్లీం మైనార్టీల సంక్షేమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముస్లిం మత పెద్దలతో సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం ఏర్పాడిన తర్వాత ముస్లీంల సంక్షేమానికి సీఎం కేసీఆర్ షాదిముబారక్, ఉర్ధుమీడియం పాఠశాలలు, హస్టళ్లను ఏర్పాటు చేసి పేద ముస్లీంలకు అండగా నిలుస్తున్నారని అన్నారు. రామగుండం కార్పోరేషన్ పరిధిలో 5ఇంక్లయిన్ ముస్లీంల కోసం షాదిఖానాను త్వరలోనే ఏర్పాటు చేస్తామని, మజీద్‌ల మరమత్తులు చేపడుతామన్నారు.
ముస్లీం మహిళల కోసం రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కోప్పులఈశ్వర్ ద్వారా విజయమ్మ పౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. అనంతరం ముస్లీంల షాదిఖానాకు నిధులు మంజూరు చేసిని ఎమ్మెల్యేను ముస్లీం పెద్దలు సన్మానించారు.
ఈ సమావేశంలో డిప్యూటి మేయర్ నడి పెల్లి అభిషేక్ రావు, కో-ఆప్షన్ సభ్యులు మహ్మద్ రఫీ, టిబిజికెఎస్ కేంద్ర కమిటి నాయకులు జహీద్ పాషా, మత పెద్దలు సత్తార్, షరీఫ్, అక్రం, అక్బర్, ఫరీద్ తదితరులు పాల్గొన్నారు.