– బతుకమ్మ సిడి ఆవిష్కరణ
– రామగుండం ఎమ్మెల్యే చందర్
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, అక్టోబర్ 7: తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా బతుకమ్మ పండుగ నిలుస్తుందని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. బుధవారం సాయంత్రం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బి.ఎన్.ఆర్ క్రియేషన్స్ ఆధ్వర్యం రూపొందిన బతుకమ్మ సి.డి.ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ… తెలంగాణ పండుగలో బతుకమ్మ పండుగను తెలంగాణ ప్రాంత ఆడపడుచులు ఎంతో ఘనంగా నిర్వహిస్తారని అన్నారు. ఈ ప్రాంత కళాకారులు బతుకమ్మ పాటలను రూపొందించడం అనందకరమని అన్నారు. ఈ కార్యక్రమం లో బడికెల గణేష్, సాగర్ నాయకులు పి.టి.స్వామి తదితరులు పాల్గొన్నారు.