(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, అక్టోబర్ 19: తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ (టీయూడబ్ల్యూజే 143) రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా తగరపు శంకర్ నియమితులైయ్యారు. ఈ మేరకు హైదరాబాద్‌లో జరిగిన టియుడబ్ల్యూజే రాష్ట్ర అత్యవసర సమావేశం సందర్భంగా తగరపు శంకరను రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా నియమిస్తు ప్రెస్ అకాడమీ చైర్మన్ అ్లం నారాయణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్ నియమాకపు ఉత్వర్వు సోమవారం జారీ చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణానికి చెందిన సీనియర్ పాత్రికేయులు తగరపు శంకర్ తెలంగాణ ఉద్యమ సమయంలో ఏర్పాటు చేసిన జర్నలిస్ట్ ఫోరం అవిర్భావం నుండి ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేశారు. టియుడబ్ల్యుజే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వివిధ పదవుల్లో కొనసాగడంతో పాటు పెద్దపల్లి జిల్లా కో`కన్వీనర్‌గా శంకర్ పనిచేశారు.
ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ జర్నలిస్ట్ సంక్షేమానికి కృషి చేస్తానని తెలిపారు. జర్నలిస్టు ఎదుర్కొంటున్న పలు సమస్య పరిష్కారానికి పాటుపడుతానని తెలిపారు. అదే విధంగా టియుడబ్ల్యుజే (143) యూనియన్ బలోపేతానికి తన వంతుగా శ్రమిస్తానని శంకర్ పేర్కొన్నారు. తనపై నమ్మకంతో రాష్ట్ర కార్యవర్గంలో అవకాశం కల్పించిన ప్రెస్ అకాడమీ చైర్మన్ అ్లం నారాయణకు, ప్రధాన కార్యదర్శి ఎ.మారుతిసాగర్‌కు, సహకరించిన రాష్ట్ర ఉపాధ్యక్షుడు బిజిగిరి శ్రీనివాస్‌కు శంకర్ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.