– వ్యవసాయ మంత్రిని కోరిన రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, అక్టోబర్ 19: రామగుండం నియోజవర్గంలోని పూట్నూర్ మార్కెట్ కమిటీని ఏర్పాటు చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డిని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కోరారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్ లో మంత్రిని ఎమ్మెల్యే కలిసారు. పూట్నూర్ లో మార్కెట్ కమిటీ ఏర్పాటు మూలంగా రైతులకు అందుబాటులో వుండి ఎంతో సౌకర్యావంతంగా ఉంటుందని మార్కెట్ కమిటీని ఏర్పాటు చేయాలన్నారు.
ఈ విషయమంపై మంత్రి సానుకులంగా స్పందించారని రెండు రోజుల్లో మార్కెట్ కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పారని ఎమ్మెల్యే తెలిపారు.