(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, నవంబర్ 16: రామగుండం ఏరియా -1 జియం కల్వల నారాయణ, గని ఏజేంట్ సురేశ్, గని మేనేజర్ సాయి ప్రసాద్‌లతో కలిలసి జిడికె.2ఎ భూగర్భ గనిని మంగళవారం సందర్శించారు.
ఈ సందర్భంగా జీఎం కల్వల నారయణ జివికె.2ఏ ఇంక్లయిన్ అండర్ గ్రౌండ్ 2-.సీమ్, ఎస్.ఎస్ 9/2 ప్యానల పరిశీలించారు. గనిలోని పని స్థలాలను వెంటిలేషన్, గనిలో చేపట్టిన రక్షణ చర్యలను తదితర విషయాలను గని మేనేజర్‌ను అడిగి తెలుసుకున్నారు.
ప్రతి ఒక్కరు రక్షణతో కూడిన ఉత్పత్తి చేయాలని, రక్షణ సూత్రాలను విధిగా పాటించాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ కరోనా పరీక్షలు చేసుకోవాలని సూచించారు. మాస్కులు తప్పని సరిగా ధరించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గని ఏజెంట్ సురేష్, గని మేనేజర్ సాయి ప్రసాద్,సేఫ్టీ ఆఫీసర్ లక్ష్మణ్, సెక్షన్ ఇంచార్జీ శంకర్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.