– యోగ సాధన జీవితంలో ఒక భాగం కావాలి
– విజయమ్మ పౌండేషన్ ద్వారా ఉచిత యోగ శిక్షణ
– ఆరోగ్య రామగుండమే లక్ష్యం…
– రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, డిసెంబర్ 14: ఆరోగ్యమే మహభాగ్యం… మన కోసం…మన ఆరోగ్యం కోసం… యోగ సాధన తప్పని సరి. యోగాతోనే పరిపూర్ణ ఆరోగ్యాన్ని పొందగలుగుతామని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తెలిపారు. సోమవారం గోదావరిఖని జవహర్‌లాల్ స్టేడియంలో విజయమ్మ పౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత యోగ శిక్షణను ఎమ్మెల్యే ప్రారంభించారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి కుటంబాన్ని ఆరోగ్యవంతంగా మార్చడమే లక్ష్యంగా విజయమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో యోగా శిక్షణ తరగతులను ఉచితంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఆరోగ్య రామగుండమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. యోగా సాధనతో పరిపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుందని, జీవితంలో ఉన్నతంగా ఎదగాలంటే యోగ సాధనే మార్గమని తెలిపారు.
యోగ సాధనతో మన శరీరంలోనీ ప్రతి అవయవానికి ప్రాణా వాయువు చేరి ఉత్తేజ వంతం అవుతాయని పేర్కొన్నారు. యోగ సాధన ప్రతి ఒక్కరికి అవసరమని, సర్వరోగాలకు నివారిణి యోగ అన్నారు. ప్రతి ఒక్కరు యోగ సాధన చేయడం అవసరమని, ఈ ఉచిత యోగ శిక్షణ తరగతులను రామగుండం ప్రజానీకం సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, యోగా గురువులు సుధాజీ, సుజాతజీ శిక్షకులు బాలా రాజ్ కుమార్, నారాయణ దాసు మారుతి, రవీందర్రెడ్డి మోహన్ సురేష్ విజయలక్ష్మి, కవిత సంధ్యా తదితరులు పాల్గొన్నారు