Home తెలంగాణ దళిత ద్రోహి ఎవరో ప్రజలే చెపుతారు…

దళిత ద్రోహి ఎవరో ప్రజలే చెపుతారు…

872
0
TRS corporators speaking at a press conference ...
TRS corporators speaking at a press conference ...

(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, జనవరి 24: అనునిత్యం ప్రజాసేవలో పునరంకితమవుతూ రామగుండం నియోజకవర్గం సమగ్రాభివృద్ధే లక్ష్యంగా శ్రమిస్తున్న్ల రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ను దళితద్రోహి అంటూ కాంగ్రెస్‌ కార్పోరేటర్లు మహంకాళి స్వామి, బొంతల రాజేష్‌లు వ్యాఖ్యానించడంపై టీఆర్‌ఎస్‌ కార్పోరేటర్లు తీవ్రంగా మండిపడ్డారు. ఈ మేరకు స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.

28వ డివిజన్‌ కార్పోరేటర్‌ ఇంజపురి పులేందర్‌ మాట్లాడుతూ దళిత ద్రోహి ఎవరో ప్రజలే చెబుతారని, పోచమ్మ మైదానంలో భూమిని మింగిన కాబ్బాదారులు ఎవరో గోదావరిఖని చౌరస్తాలో ఎవరిని అడిగినా చెబుతారని అన్నారు. కాంగ్రెస్‌ కార్పోరేటర్లు దిగజారి మాట్లాడడం సరైంది కాదని తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ముందుండి పోరాడిన కోరుకంటి చందర్‌ ఎన్పోమార్లు జైలు పాలయ్యారని తెలిపారు. ఎన్నికల సమయంలో తన సహచరిని కోల్పోయినా మొక్కవోని ధైర్యంతో ముందున్న చందర్‌ను ప్రజలంతా గెలిపించారని తెలిపారు.

ఎమ్మెల్యే పదవి బాధ్యతలు చేపట్టిన నాటి నుండి ప్రజల అక్షాంక్షలు, ప్రజల ఆవసరాలను అనుగుణంగా పనులను నిర్వర్తిస్తూ రోజుకు 18 గంటలు ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం శ్రమిస్తున్నామని తెలిపారు. అభివద్ధిలో రామగుండం నియోజవక వర్గాన్ని రాష్ట్రంలోనే నెంబర్‌ వన్‌ గా నిలపాలన్నా తపనతో పరిపాలన సాగిస్తున్నారని తెలిపారు. అలాంటి ఎమ్మెల్యేను దళితద్రోహి అనడం శోచనీయని తెలిపారు.

ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులు కేటాయింపులో విషయంలో మేయర్‌, కమీషనర్‌కు సంబంధించిన విషమని తెలిపారు. అయినప్పటికి అన్ని డివిజన్లకు సమానంగా కేటాయింపులు జరుగుతున్నాయని, కొంత అటుఇటు జరిగినంత మాత్రాన దళితులకు అన్యాయం చేశారని మహంకాళి స్వామి, బొంతల రాజేష్‌ గొంతు చించుకుంటుంన్నారని ఇది వారి దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని తీవ్రంగా విమర్శించారు. అసలు వారు దళితులకు చేసిందేమిటో చెప్పాలని డిమాండ్‌ చేసారు. ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించకుండా కౌన్సిను అడ్డుకోవడం, దళిత మేయర్‌పై ఎజెండా కాపీని చింపి విసరడం, ఇష్టానుసారంగా మాడ్లాడం వారి దిగజారుడు తనానికి నిదర్శనమని విమర్శించారు. ఇకముందు ఇలాంటి  ఆరోపణలు చేస్తే ప్రజలే వారికి తగిన గుణపాఠం చెపుతారని హెచ్చరించారు.

ఈ విలేకరు సమావేశంలో 35 డివిజన్‌ కార్పోరేటర్‌ పాముకుంట్ల భాస్కర్‌, 33వ డివిజన్‌ కార్పోరేటర్‌ దొంత శ్రీనివాస్‌, 3వ డివిజన్‌ కార్పోరేటర్‌ కుమ్మరి శ్రీనివాస్‌, 9వ డివిజన్‌ కార్పోరేటర్‌ జనగామ కవిత సరోజన టిఆర్‌ఎస్‌ నాయకుడు జె.వి.రాజు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here