Home తెలంగాణ అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేయాలి

అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేయాలి

1136
0
Choppadandi MPP General Body Meeting
MPP Chiluka Ravinder speaking at General Body Meeting

– ఎంపీపీ చిలుక రవీందర్‌

(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
చొప్పదండి, ఫిబ్రవరి 12: మండలంలో మనవూరు మన బడి సహా సీసీ రోడ్లు ఇతర అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేసుకోవాలని ఎంపీపీ చిలుక రవీందర్‌ పేర్కొన్నారు. ఆదివారం చొప్పదండి మండల ప్రజా పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ చిలుక రవీందర్‌ అధ్యక్షతన డాక్టర్‌ బి అర్‌ అంబేద్కర్‌ సమావేశ మందిరంలో జరిగింది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పూర్తయిన పనులకు ఇంజనీరింగ్‌ అధికారులు బిల్లులు చెల్లించాలని ఆదేశించారు. మండలంలో దోమల మందు పిచికారి చేయించి విష జ్వరాలు అరికట్టేలా సర్పంచులు మరిన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు.

Choppadanti MPP General Body Meeting
MPTCs participated in MPP General Body Meeting

వాడి వేడిగా మండల సర్వ సభ్య సమావేశం

మండలంలోని పలు సమస్యలు ప్రస్తావించడంతో సర్వ సభ్య సమావేశం వాడి వేడిగా జరిగింది. రైతు బంధు అరకోరగా కొంతమందికి మాత్రమే ఇచ్చారని, డ్రిప్‌ స్రింక్లర్‌ యూనిట్లు ఎందుకు కేటాయించడం లేదని సభ్యులు ప్రశ్నించారు.

Choppadandi MPP Geneal Body Meeting
MPTC Singireddy Krishna Reddy speaking at MPP General BOdy Meeting

ఎంపీటీసీ ఫోరం అధ్యక్షుడు, రాగంపేట ఎంపీటీసీ సింగిరెడ్డి కృష్ణారెడ్డి మాట్లాడుతూ అర్హత ఉన్న మహిళలకు రెండు లక్షల రుణ సహాయం చేసే అవకాశం ఉన్నా రుణాలు ఎందుకు ఇవ్వడం లేదని పేర్కొన్నారు. పశువుల చికిత్సకు ఉపయోగించే ట్రైవిన్‌ లు గ్రామ పంచాయితీలకు పంపినప్పటికి వాటిని బిగించడం లేదని తక్షణం వాటిని బిగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. రాగంపేట ఉప కేంద్రం డాక్టర్‌ ను గుంలపుర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఎలా పంపిస్తారని, డాక్టర్‌ ను తిరిగి రాగంపేట పంపాలని డిమాండ్‌ చేసారు. మధ్యాహ్న భోజన పథకంను ఉపాద్యాయులు సరిగా పర్య వేక్షించక పోవడంతో నాణ్యత లోపిస్తుందని, ఎప్పటినుండి మెరుగు పరుస్తారో సమాధానం చెప్పాలని పట్టుబట్టారు. రాగంపేటలో అంగన్వాడి టీచర్‌ ఏ రోజు సరిగా బడికి రావడం లేదని, పిల్లలకు ప్రి స్కూల్‌ విద్య జరపడం లేదని, అంగన్‌ వాడి పర్యవేక్షకులు పర్యవేక్షణ సరిగా జరపడంలేదని ఆరోపించారు.

పని చేయని ప్రభుత్వ సిబ్బంది పై చర్య తీసుకోవాలని పలువురు సభ్యులు డిమాండ్‌ చేశారు. అసరా పెన్షన్‌ పొందుతున్న భర్త చని పోయిన మహిళలకు వితంతు పెన్షన్లు వెంటనే ఇస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం ఆచరణ లో మాత్రం అడ్డంకులు సృష్టిస్తున్నదనీ గుమ్ములాపుర్‌ రాగంపేట ఎంపీటీసీ లు బత్తుల లక్ష్మి నారాయణ, సింగిరెడ్డి కృష్ణారెడ్డి లు ద్వజమెత్తారు.

వైద్య శాఖ అధికారులు గ్రామాల్లో క్లోరినేషన్‌ పరీక్షలు జరపడం లేదని, తక్షణం జరిపించాలని తోట కొటేష్‌ సభ దృష్టికి తీసుకు వచ్చారు. మరణ ధృవీకరణ పత్రం నెల రోజులు దాటితే ఇవ్వమని పంచాయతీ కార్యదర్శులు సమాధానం చెప్పటం దారుణమని, ఇంకుడు గుంతల బిల్లులు, మరుగు దొడ్ల బిల్లులు ఒకరికి బదులు మరొకరి ఖాతాల్లో ఎందుకు పడుతున్నాయని పలువురు సభ్యులు ప్రశ్నించారు.

రాగంపేట అర్ణకొండల్లో రెండు ఫేజుల విద్యుత్‌ లైన్లను మూడు ఫెజుల విద్యుత్‌ లైన్లుగా మార్చేలా తీర్మానం చేయాలని సింగిరెడ్డి కృష్ణారెడ్డి ప్రతి పాధించగా సభ్యులు తోట కోటేష్‌, కూకట్ల తిరుపతి బలపరచగా సభ ఏకగ్రీవంగా తీర్మానించిoది. పలు అభివృద్ధి పనులు చేయాలని ఈ సమావేశంలో తీర్మానించారు.

ఈ సమావేశంలో ఎంపిడిఓ ఇనుకొండ స్వరూప రాణీ, పంచాయతీ రాజ్‌ డీ ఈ, ఏ ఈ, సర్పంచ్లు కొత్తపల్లి రామకృష్ణ, పెద్ది శంకర్‌, ఎంపీటీసీ సభ్యులు, కూకట్ల తిరుపతి, కట్టేకోల తార, వైద్య, విద్య, విద్యుత్‌ మిషన్‌ భగీరథ, పశు సంవర్తక తదితర మండల స్థాయి అధికారులు, కార్యాలయ సిబ్బంది నారోత్తం రెడ్డీ, హరి కృష్ణ, శ్రీనివాస్‌ లు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here