– రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, సెప్టెంబర్ 13: రామగుండం కార్పోరేషన్ సంపూర్ణ అభివృద్దే లక్ష్యంగా పాలన సాగిస్తున్నామని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. అదివారం 39వ డివిజన్ గౌతమినగర్ లో 7 లక్షల వ్యయంతో నిర్మించతలపెట్టిన సిసి రోడ్డుకు ఎమ్మెల్యే కోరుకంటి చందర్ భూమిపూజ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణాల అభివృద్దిపై రాష్ట్ర పురపాలక మంత్రి కేటిఆర్ ప్రత్యేక దృష్టి సారించి ప్రణాళిక బద్దంగా ముందుకెలుతున్నారు. అందులో భాగంగానే రామగుండం కార్పోరేషన్ పరిధిలో ప్రజలకు మౌళికవసతుల కల్పన కృషి చేస్తున్నా మన్నారు. కార్పోరేషన్ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని చెప్పారు. అందుకు ప్రజలంతా సహకరించాలని కోరారు. ప్రతి డివిజన్ లోని ప్రజలు తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, డిప్యూటి మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు, కార్పోరేటర్ జెట్టి జ్యోతి-రమేష్, నాయకులు గడ్డి కనకయ్య, తోడేటి శంకర్ గౌడ్, గోపగాని మోహన్ గౌడ్, ఆడప శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.