– ఎమ్మెల్యేలను అదుపులో పెట్టుకునే బాధ్యత సీఎంపై వుంది
– పటాంచెరువు ఎమ్మెలపై చర్యలు తీసుకోవాలి
– కత్తులతో కాదు కలంతో సమాధానం చెపుతాం
– గోదావరిఖని ప్రెస్‌క్లబ్ అధ్యక్షులు వంశీ
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, డిసెంబర్ 10: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌పై పాత్రికేయులకు గౌరవం వుందని… టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను అదుపులో పెట్టుకోవాల్సిన బాధ్యత సీఎంపై వుందని పాత్రికేయులను దూషిస్తే ఉర్కోబోమని గోదావరిఖని ప్రెస్‌క్లబ్ అధ్యక్షులు మల్లావజ్జుల వంశీ అన్నారు. గోదావరిఖని ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో కార్పోరేషన్ ఆఫీసు టి-జంక్షన్ రాజీవ్ రహదారిపై గురువారం పాత్రికేయులు రస్తారోకో నిర్వహించారు.
ఈ సందర్బంగా వంశీ మాట్లాడుతూ పటాన్ చెరువు విలేకరి సంతోష్ నాయక్‌పై ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి చేసిన దూషణలు, చంపుతాం, నరుకుతాం అనడం సభ్య సమాజం తలదించుకునేలా వుందని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు తమ పద్దతులు మార్చుకోవాలని డిమాండ్ చేశారు. పద్దతి మార్చుకోకపోతే కత్తులతో కాదు కలంతో సమాధానం చెపుతామని హెచ్చరించారు. ఎమ్మెల్యే, ఆయన అనుచరులు భూకబ్జా లకు పాల్పడితే ఆ విషయాన్ని వార్త రూపంలో ప్రచురించడం జరిగిందన్నారు. భూకబ్జాలు, అక్రమాలకు పాల్పడితే వాటిని బయటకు తీయాల్సిన బాధ్యత పాత్రికేయులపై వుందని వంశీ పేర్కొన్నారు. మీడియా స్వేచ్ఛను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన వుందన్నారు.
టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తక్షణమే పటాన్ చెరువు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలన్నారు. అక్రమాలు, అవినీతి, భూకబ్జాలకు పాల్పడితే ప్రజాసామ్య వ్యవస్థలో పాత్రికేయులకు రాసే హక్కు వుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 20వేలకు పైగా జర్నలిస్టులు వున్నారన్నారు. జర్నలిస్టులు సమాజ హితం కోసం పనిచేస్తుంటే.. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి లాంటి వ్యక్తులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం అవివేకమన్నారు. ఇప్పటికైనా నోరు అదుపులో వుంచుకొని మాట్లాడాలని వంశీ డిమాండ్ చేశారు. గంటపాటు పాత్రికేయులు రోడ్డు బైటాయించడంతో రాజీవ్‌రహదారి ఇరువైపుల కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి.
ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు పిట్టల రాజేందర్, కోల లక్ష్మణ్, పాలకుర్తి విజయ్‌కుమార్, పందిళ్ల శ్యాంసుందర్, ప్రెస్‌క్లబ్ ప్రధానకార్యదర్శి పూదరి కుమార్‌గౌడ్, కోశాధికారి దయానంద్‌గాంధీ, డి.మాధవరావు, గడ్డం శ్యాంకుమార్‌గౌడ్, మహేందర్‌రెడ్డి, బైరం సతీష్, కేఎస్ వాసు, కొండాల్‌రెడ్డి, భాస్కర్, జెట్టి రాము, రవి, శేఖర్, రాజ్‌కుమార్, కుమార్ ఇజయగిరి శ్యాంకుమార్, ఉదయ్, కేపీ శ్రీను, తిప్పని తిరుపతి, శంకర్‌గౌడ్, సంపత్, తదితరులు పాల్గొన్నారు.