– గ్రేటర్ ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించండి…
– రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
హైదరాబాద్, నవంబర్ 20ః దేశానికే అదర్శవంత మైన అభివృద్ధి, సంక్షేమ పధకాలను విజయవంతంగా అమలు చెస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మద్దతుగా నిలువాలనీ, అభివృద్ధి కి తిరిగి పట్టం కట్టాలనీ రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు.
గ్రేటర్ ఎన్నికల్లో భాగంగా శుక్రవారం హైదరాబాద్ జి.హెచ్.ఎం.సి పరిధిలో 137 వ డివిజన్ టిఆర్ఎస్ ఆభ్యర్ది పుష్పలత రెడ్డి తరుపున ఎమ్మెల్యే ప్రచారం నిర్వహించారు. వాడవాడల తీరుగుతూ టిఆర్ఎస్ అభ్యర్థిని గెలపించాలని ఓటర్లను కోరారు.
సందర్భంగా ఆయన మాట్లాడుతూ… భాగ్యనగరం సంపూర్ణ అభివృద్ధి సీ.ఎం కేసీఆర్‌తోనే సాధ్యమవు తుందనీ అన్నారు. అన్ని వర్గాల ప్రజలు సంక్షేమం కోసం ఆహర్నిషలు పాటు పడుతున్న తెరాసకు ప్రజలందరు మద్దతుగా నిలువాలనీ, కారు గుర్తు కు ఓటు వేయాలన్నారు.