(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, సెప్టెంబర్ 11: దేశానికే ఆదర్శంగా సిఎం కెసిఆర్ మరోమారు నిలిచారని, దేశ చరిత్రలో ఈ రోజు చారిత్ర్మకమైనదని, ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా, అందరికీ ఆమోదయోగ్యంగా కొత్త రెవెన్యూ చట్టం ఉండబోతుందనీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ లు తెలిపారు.
అసెంబ్లీలో కొత్త రెవెన్యూ చట్టం ఆమోదం పొందిన అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ను మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ లు కలిసి పుష్పగుచ్చం అందించి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశంలో ప్రజా సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం మెదటి స్దానంలో నిలిపిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దే అన్నారు. ప్రజలకు పారదర్శకంగా, అవినీతికి, వివాదాలకు అస్కారం లేకుండా చట్టాన్ని తీసుకువచ్చారని అన్నారు. ఒక్క రోజులోనే భూమలు రిజిస్ట్రేషన్, మ్యూటేషన్, పాసుబుక్కులు ఇంటికి వచ్చేవిధంగా చట్టాన్ని రూపొందించినట్లు తెలిపారు.