– తెలంగాణ ఆర్యవైశ్యసంఘాల ఐక్యవేదిక అధ్యక్షుడు బుస్సా శ్రీనివాస్
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
హైదరాబాద్, డిసెంబర్ 11: వైశ్య కార్పోరేషన్ ఏర్పాటు, ఈడబ్య్యూఎస్ రిజర్వేషన్ల అమలు కోసం అమరనిరహారదీక్ష చేపట్టనున్నట్లు తెలంగాణ ఆర్యవైశ్య సంఘాల ఐక్యవేదిక అధ్యక్షుడు బుస్సా శ్రీనివాస్ ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఈ సందర్భంగా బుస్సా శ్రీనివావాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ర్టం ఆర్యవైశ్యుల్లోని నిరుపేదలను ఆదుకునేందుకు ప్రభుత్వం వైశ్య కార్పోరేషన్ ఏర్పాటు చేస్తామని మాట ఇచ్చి కాలయాపన చేస్తుందన్నారు. అలాగే అగ్రవర్ణ పేదల సంకేమానికి నిర్ధేషించిన ఇబ్ల్యూఎస్ రిజర్వేషన్‌లు అమలుకు నోచుకోవడంలేదని తెలిపారు. వైశ్య కార్పోరేషన్ ఏర్పాటు, ఇడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలుకు సంబందించి డిసెంబర్ 13 ఆదివారం ముషీరాబాద్‌లోని వైశ్య హాస్టల్‌లో ఆర్యవైశ్య సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో వైశ్య సంఘాలతో చర్చించి దీనికి సంబందించిన 100 రోజుల కార్యాచరణను ప్రకటించునున్నట్లు వివరించారు. అప్పటికి ప్రభుత్వం వైశ్య కార్పోరేషన్, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను అమలు చేయనట్లయితే తాను ఆమరణ నిరహార దీక్ష చేపడతానని తెలిపారు.
ఆదివారం నిర్వహించే ఆర్యవైశ్య సంఘాల ఐక్యవేదిక తలపెట్టిన ప్రత్యేక సమావేశానికి ఆర్యవైశ్య సొదర, సోదరీమణులందరు హాజరై తగిన సూచనలు, సలహాలు ఇవ్వాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. వైశ్యకార్పోరేషన్ ఏర్పాటు, ఈడబ్య్యూఎస్ రిజర్వేషన్ అమలుకై తెలంగాణలోని అన్ని ఆర్యవైశ్య సంఘాలు సంఘటితంగా ఎక్కడికక్కడే చట్టబద్దంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం దిగి వచ్చేవరకు ఉమ్మడిగా ఉద్యమించాలని ఆర్యవైశ్యులందరికి విజ్ఞప్తి చేసారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి వైశ్య కార్పోరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసారు.
ఈ విలేకరుల సమావేశంలో ఆర్యవైశ్య సంఘాల ఐక్యవేదిక ప్రధాన కార్యదర్శి పడకంటి రమేశ్, ఉపాధ్యక్షులు ఉప్పల రామేశం, కోశాధికారి అయిత నాగరాజు, శకిలం రాజు, ఇంటర్నేషనల్ వాసవి ఆర్యవైశ్య మహిళా సమాఖ్య అధ్యక్షురాలు ఉప్పల రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.