– సివిల్ డిపార్ట్‌మెంట్-రీజియన్ ల్యాబ్‌లో స్వచ్చతా మాసోత్సవాలు
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, అక్టోబర్ 15: పర్యావరణాన్ని పరిరక్షించేందుకు మన చుట్టూ వున్న పరిసరాలను పరిశుభ్రంగా వుంచుకోవడం మనందరి బాధ్యతని సింగరేణి సివిల్ డిపార్ట్‌మెంట్ డిజియం (సివిల్) నవీన్ కుమార్ తెలిపారు. భారత ప్రభుత్వం అదేెశానుసారం జాతిపితా మహాత్మా గాందీ 151వ జయంతి సందర్బంగా నీరు, పారి శుధ్యం, పరిసారాలు పరి శుభ్రంగా ఉంచుట కొరకు స్వచ్చతా హి సేవా 2020లో భాగంగా స్వచ్చతా మాసోత్సవాలు దేశ వ్యాప్తంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా గురువారం సింగరేణి సివిల్ డిపార్ట్ మెంట్, రీజియన్ ల్యాబ్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిజియం సివిల్ నవిన్ కుమార్ మరియు డీజియం ఆనాటికల్ గిరిధర్ రాజులు పాల్గొని ఉద్యోగులచే ప్రతిజ్ణ చేయించి ప్రారంభించారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ స్వచ్చతా హి సేవా ఒక గొప్ప కార్యక్రమం అని గాందీజి కళకు కన్న స్వచ్చమైన భారత దేశం నిర్మాణంలో స్వచ్చతా మాసోత్స వాలు ముఖ్య భూమికను పోషింస్తునదని తెలిపారు. దేశం మొత్తం ఈ స్వచ్చతా మాసోత్సవాలు నిర్వ హిస్తుందని పేర్కొన్నారు.
మన ఇంటిని ఏ విధంగా శుభ్రంగా ఉంచుకుంటామో అదే విధంగా ప్రతి ఒక్కరూ విధిగా మన చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా వుంచుకోవడం సామాజిక బాధ్యతగా గుర్తుంచుకోవాలన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ గుడ్డ సంచులను వాడాలని, ప్లాస్టిక్ వాడకాన్ని నిర్మూలించాలని సూచించారు. అనంతరం పర్యావరణ పరిరక్షణకు పాటుపడు తామని ప్రతిజ్ఞ చేశారు.
ఈ కార్యక్రమంలో డిజియం సివిల్ నవిన్ కుమార్, డిజియం ఆనాటికల్ గిరిధర్ రాజు, వసంత్ కుమార్ ఈ.ఈ, వెంకటేశ్వర్లు, కోటేశ్వర్ రావు, దుర్గా ప్రసాద్, నాయకులు వెంకటేశ్ మరియు సివిల్, ఆనాటికల్ ల్యాబ్ ఉద్యోగులు పాల్గొన్నారు.
సెంటినరీకాలనీలో స్వచ్ఛతా కార్యక్రమం
సింగరేణి ఆర్‌జీ-3 పరిధి సెంటినరికాలనీ జోన్-2లో స్వచ్ఛతా కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఆర్‌ఓ ప్లాంటు పరిసరాలు, జీఎం కార్యాలయం కాంపౌండ్‌వాల్ ఆవరణలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని సెంటినరకాలనీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ అన్నదాత పూర్ణచంద్రారావు ప్రారంభించారు. పాత సబ్‌స్టేషన్ ముందు వాటర్ ట్యాంకు చుట్టు వున్న చెత్త తొలగించడంతో పాటు ముళ్లపొదలు తొలగించి పరిశుభ్రం చేసారు.
ఈ సందర్బంగా అన్నదాత పూర్ణచంద్రారావు మాట్లాడుతూ… ఆర్‌ఓ ప్లాంటు సింగరేణి నిర్వహిస్తూ శుద్ది జలాన్ని కార్మికులకు అందిస్తున్నదన్నారు. తద్వారా ఆరోగ్య పరిరక్షణకు కృషి చేస్తుందన్నారు. ప్రతి ఒక్కరు పరిశుభ్రత పాటించాలన్నారు. కరోన మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హౌస్ కీపింగ్ కార్మికులు మారుతి, పాషా, రామాంజనేయులు పాల్గొన్నారు.
ఏఏల్‌పీలో స్వచ్ఛ మహా పక్వాడ
సింగరేణి ఆర్‌జీ-3 పరిధి అడ్రియాల లాంగ్‌వాల్ ప్రాజెక్టు (ఏఏల్‌పీ)లో స్వచ్ఛ మహా పక్వాడ కార్యక్రమాన్ని గురువారం జీఎం ఎన్.వి.కె.శ్రీనివాస్, టీబీజీకేఏస్ ఉపాధ్యక్షులు గౌతం శంకరయ్య ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సింగరేణి అధికారులు కె.నాగేశ్వర్‌రావు, విలాస్ పోద్దార్ శ్రీనివాస్, రావుల పాపయ్య, టీబీజీకేఏస్ నాయకులు దాసరి మల్లేశ్, శివశంకర్, రాంబ్రహ్యం, పెంచలయ్య, పి.మల్లేశ్, డి.నాగేశ్వర్‌రావు, డి.సారధి, కె.శ్రీకాంత్, బి.శంకర్ తదితరులు పాల్గొన్నారు.