(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, సెప్టెంబర్ 24: రామగుండం ఏరియా-1 జియం కె.నారాయణ గురువారం జిడికె-2ఏ ఇంక్లైన్ భూగర్భ గనిని సందర్శించారు. 2ఏ ఇంక్లైన్ గని లోని పని స్థలాలను సందర్శించారు. పని స్థలాల్లోని గాలి, వెలుతురుకు సంబంధించిన విషయాలను పరిశీలించారు. గనిలో చేపడుతున్న రక్షణ చర్యలను తదితర విషయాలను గని మేనేజర్ ను అడిగి తెలుసుకున్నారు.
ప్రతి ఒక్కరు రక్షణతో కూడిన ఉత్పత్తి ని చేపట్టాలని, విధిగా రక్షణ సూత్రములను పాటించాలని సూచించారు. ఉద్యోగులందరు కరోనా పరీక్షలు చేసుకోవాలని తెలిపారు. మాస్కులు తప్పని సరిగా ధరించాలని తెలిపారు. కార్యక్రమంలో గని ఏజెంట్ సురేష్, మేనేజర్ సాయి ప్రసాద్ పాల్గొన్నారు