Home తెలంగాణ భవిష్యత్ తరాలకు స్వచ్చ వాతావరణం అందించేందుకు హరితహారం

భవిష్యత్ తరాలకు స్వచ్చ వాతావరణం అందించేందుకు హరితహారం

481
0
MLA Chandar Speaking
Ramagundam MLA Korukanti Chandar Speaking at meeting

దేశానికి దిక్సూచి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్
తెలంగాణ ప్రాంతానికి వన్నెతెచ్చిన పి.వి.నరసింహరావు
– రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్

(ప్రజాలక్ష్యం విలేకరి – రామగుండం నియోజకవర్గం)
ఆగష్టు 31: వాతావరణ కలుష్యాన్ని నియంత్రించి భవిష్యత్తు తరాలకు స్వచ్చ వాతావరణం, పచ్చదనం అందించేందకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో హరితహారం కార్యక్రమాన్ని చేపట్టినట్లు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పేర్కొన్నారు. ఇందులో భాగంగానే సోమవారం గోదావరిఖని పట్టణంలోని గాయిత్రి హైస్కూల్ లో నేషనల్ యూత్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో పి.వి.నరసింహరావు శతజయంత్సోవాల్లో భాగంగా నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మొక్కలు నాటారు. ముందుగా మహనీయుల చిత్ర పటాలకు పూల మాలలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహానుభావుల ఆలోచన విధానం భవిష్యత్ తరాలు బాగుండాలనే విధంగా ఉంటాయని, దేశంలో అర్ధిక సంస్కరణలు తెచ్చి, తెలంగాణ ప్రాంతానికి వన్నెతెచ్చిన వ్యక్తి బహుబాషాకోవిదులు అయిన పి.వి. నరసింహరావు అన్నారు. తెలుగు వాడు అందునా తెలంగాణకు చెందిన పి.వి.నరసింహ రావు ప్రధాన మంత్రి పదవినలంకరించడం తెలంగాణకే గర్వకారణమన్నారు. తెలంగాణ ప్రాంతంలో పచ్చదనం, స్వచ్చ వాతవారణం లక్ష్యంగా సిఎం కేసీఆర్ తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టి దేశానికే దిక్సూచిగా నిలిచారన్నారు. ప్రతి వ్యక్తి ఇంట్లో మొక్కలు నాటడం నిత్య జీవితంగా ఒక భాగంగా చేసుకోవాలని, మొక్కలు నాటడం ద్వారా ఆరోగ్యంగా జీవిస్తామని తెలిపారు.

Planting
MLA Kurukanti Chandar Planting

ఈ కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, డిప్యూటి మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు, కార్పోరేటర్లు దోంత శ్రీనివాస్, బాల రాజ్ కుమార్, ఎన్.వి.రమణరెడ్డి, నాయకులు పాతపెల్లి ఎల్లయ్య, శ్రీనివాసరెడ్డి, డాక్టర్ నారాయణ, అందె సదానందం, యాదవరాజు, సమ్మిరెడ్డి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here