Home తెలంగాణ పారిశుద్ధ్య కార్మికుల సేవలు మరువలేనివి-ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

పారిశుద్ధ్య కార్మికుల సేవలు మరువలేనివి-ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

450
0
goods distribution

జగిత్యాల: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తి నిరోధించడానికి అవిశ్రాంతంగా కృషి చేస్తున్నా పారిశుద్ధ్య కార్మికుల సేవలు మరువలేనివని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి కొనియాడారు.

జగిత్యాల మున్సిపాలిటీ లో పనిచేస్తున్న సుమారు 300 మంది పారిశుధ్య కార్మికులకు శుక్రవారం తెల్లవారుజామున 2లక్షల విలువ చేసే నిత్యావసర వస్తువులను జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పంపిణీ చేశారు.

ఈసందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించడంతో ప్రజలు ఇళ్ళకే పరిమితం కాగా పోలీసులు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు మాత్రమే కరోనా మహమ్మారి ని నిరోధించడానికీ ప్రాణాలను పణంగా పెట్టి సేవలందిస్తున్నారని తెలిపారు.

జగిత్యాల పట్టణంలో ఎప్పటికప్పుడు మురుగు కాల్వలు శుభ్రం చేస్తూ వీధులను శుభ్రం చేయడంతో పాటు ఇళ్ళల్లోనీ, వీధుల్లోని చెత్తను తొలగించి పరిశుభ్రంగా ఉంచుతూ కరోనా వైరస్ వ్యాప్తి ని అరికట్టడంలో కార్మికుల కీలకపాత్ర పోషిస్తున్నారని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం వీరి జీతాలను వెంటనే అందించాలనీ సూచించారు.

కార్మికులు వారి కుటుంబ సభ్యులను వదిలీ కరోనా వ్యాధి మహమ్మారి అయినప్పటికీ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సమాజం కోసం మేమున్నామంటూ పరిశుభ్రతకు పాటుపడుతున్నారని, వీరికీ ఏమిచ్చినా తక్కువేననీ, వారి రుణం తీర్చుకోలేనిదనీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

ఈకార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్లు తాటిపర్తి విజయ లక్ష్మి, దేవెందర్ రెడ్డి, గిరి నాగభూషణం, మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ కల్లెపెల్లి దుర్గయ్య, కౌన్సిలర్ నక్క జీవన్, కాంగ్రెస్ నాయకులు కొత్త మోహన్, దేవెందర్ రెడ్డి, గాజుల రాజేందర్, బింగి రవి,అల్లాల సరిత, పులి రాము, రఘువీర్ గౌడ్, కమటాల శ్రీ నివాస్, కోర్టు శ్రీ నివాస్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here