– సంక్షేమ శాఖ మాత్యులు కొప్పుల ఈశ్వర్
– గోదావరి నదిపై రాష్ట్రస్థాయి తెప్పల పోటీలు
– ఎనిమిది జిల్లా నుంచి పోటీదారులు హాజరు
– విజేతలకు బహుతులు అందించిన సీపీ, ఎమ్మెల్యే
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, డిసెంబర్ 13: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రాన్ని సశ్యశామలం చేద్దామన్న మహా సంకల్పంతో తెలంగాణ రైతాంగానికి సాగు నీరు అందించే బహత్తర కార్యక్రమంలో భాగంగనే కాళేశ్వర ప్రాజెక్టును ఎంతో అద్భుతంగా నిర్మించి తెలంగాణకు జీవదారగా మార్చిన జల ప్రధాత సీఎం కేసిఆర్ అని రాష్ట్ర సంక్షేమ శాఖ మాత్యులు కొప్పుల ఈశ్వర్ అన్నారు.
ఆదివారం గోదావరిఖని సమ్మక్క-సారలక్క గద్దెల సమీపంలో గోదావరినదిపై తెలంగాణ మత్స్యవీర కేసిఆర్ కప్ రాష్ట్ర స్థాయి తెప్పల పోటీలను మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, సుంకె రవిశంకర్, జెడ్పి చైర్మన్ పుట్ట మధుకర్‌లతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్, కోరుకంటి చందర్ మాట్లాడుతూ సముద్రంలో కలుస్తున్న గోదావరి నీళ్ళను ఒడిసిపట్టి గొప్పగా కాళేశ్వర ప్రాజెక్టు నిర్మాణం జరిగిందని, తూర్పున పారుతున్న గోదావరి నదిని పడమరదిశ మార్చి ఎండిన గోదావరి నదికి జీవం పోసిన అపర భగీరథుడు సీఎం కేసిఆర్ అని అన్నారు. 365 రోజులు 250కిలో మిటర్లు మేర గోదావరి నదిని నిండు కుండలాగా సముద్రాన్ని తలపించే విధంగా మార్చిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్‌కు దక్కుతుందన్నారు..
కేరళ ప్రాంతాల్లో నిర్వహించే పడవల పోటీలు గోదావరి నదిపై మత్స్యవీర కేసిఆర్ కప్ రాష్ట్ర స్థాయి తెప్పల పోటీలను రెండవ సారి ఎంతో కన్నుల పండుగగా నిర్వహించడం జరుగు తుందన్నారు. కాళేశ్వర ప్రాజెక్టు నిర్మాణంతో మత్స్య సంపద అభివద్ధిచెంది మత్స్య కారులకు జీవనోపాది లభించిందని అన్నారు. ఈ ప్రాంతంలోని ప్రజలకు ఎంతో ఉల్లాసం కలిగించేలా తెప్పల పోటీలు జరుగుతున్నాయని తెలిపారు.
తెలంగాణ వరప్రదాయనీ కాళేశ్వరం ప్రాజెక్టు
రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మాట్లాడుతూ రైతాంగానికి సాగునీరు అందించే బృహత్తర కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు రాష్ట్రానికి వరప్రదాయినిగా మారిందని తెలిపారు. గోదావరినదిపై తెప్పల పోటీలు నిర్వహించడం ఆనందంగా వుందన్నారు.
ఈ కార్యక్రమంలో రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్, జడ్పీటీసీ అముల నారాయణ, డిప్యూటి మేయర్ నడిపెల్లి అభిషేక్‌రావు, కార్పొరేటర్లు దాతు శ్రీనివాస్, ఎన్.వి.రమణారెడ్డి, కొమ్ము వేణు గోపాల్, దొంత శ్రీనివాస్, మేకల సదానందం, పాము కుంట్ల భాస్కర్, బాల రాజ్ కుమార్, ఇంజపురి పులేందర్, మంచికట్ల దయాకర్, నీల పద్మ-గణేష్, కవిత సరోజిని, గోలివాడ ప్రసన్న కుమార్, దీటి బాలరాజు, నారాయణదాసు మారుతి, దుర్గం రాజేషం, అచ్చె వేణు, బొడ్డుపల్లి శ్రీనివాస్, గనముక్కుల తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న తెప్పల పోటీలు
మత్స్యవీర కేసీఆర్ కప్ రాష్ట్రస్థాయి తెప్పల పోటీలు ఆకట్టుకున్నాయి. ఈ పోటీల్లో ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబాద్, భూపాల్‌పల్లి జిల్లాకు చెందిన 189 మంది పాల్గొన్నారు. సాయంత్రం 5 గంటల వరకు పోటీలు జరిగాయి. పోటీల్లో పాల్గొన్న యువతకు మెమెంటోలు, పైనల్స్‌లోనిలిచిన వారికి కప్‌తో పాటు ప్రైజ్ అందించారు. గోదావరి బ్రిడ్డి సమీపంలో ఈ పోటీలు నిర్వహిండంతో పలు ప్రాంతాల ప్రజలు బ్రిడ్జిపైకి చేని ఆసక్తిగా తిలకించారు.
విజేతలకు బహుమతుల పంపిణి
గోదావరి నదిలో నిర్వహించిన మత్స్యవీర కేసీఆర్ కప్ రాష్ట్రస్థాయి తెప్పల పోటీల విజేతలను ప్రకటించారు. ఈ పోటీల్లో 8 జిల్లాలకు చెందిన 189 మంది పాల్గొన్నారు. వీరిలో మంచిర్యాల జిల్లా దొనకొండ గ్రామానికి చెందిన కూనారపు రాజేశ్ ప్రథమ బహుమతి (25వేల నగదు) రెండవ బహుమతి దొనకొండ గ్రామానికి చెందిన ఎనుకుంట్ల రాజేష్ (15వేల నగదు), తృతీయ బహుమతి ఎన్టీపీసీ మల్కాపూర్‌కు చెందిన పిట్టల వెంకటేష్ (10వేల నగదు) సాధించారు. నగదు పురస్కారాలతో పాటు కప్‌ను ఎమ్మెల్యే కోరుకంటి చందర్, సీపీ సత్యనారాయణలు అందజేసారు.