1 గ్రూప్ ఆఫ్ మైన్స్ ఏజెంట్ సురేష్
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, అక్టోబర్ 5: ప్రతి ఒక్కరూ తమ చుట్టూ వున్న పరిసరాలను పరిశుభ్రంగా వుంచుకోవాలని 1 గ్రూప్ ఆఫ్ మైన్స్ ఏజెంట్ సురేష్ తెలిపారు. భారత ప్రభుత్వం ఆదేశానుసారం జాతిపితా మహాత్మా గాంధీ 151వ జన్మదినం సందర్బంగా నీరు, పారిశుధ్యం, పరిసారాలను పరిశుభ్రంగా ఉంచుట కొరకు స్వచ్చతా హి సేవా-2020లో భాగంగా స్వచ్చతా మాసోత్సవాలను అక్టోబర్ 2 నుండి సింగరేణిలో చేపట్టారు. అందులో భాగంగానే సోమవారం జిడికె 1 మరియు 3 ఇంక్లైయిన్ గనుల వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 1 గ్రూప్ ఏజెంట్ సురేష్, మేనేజర్ ఎస్.పి సింగ్ హాజరై ప్రతిజ్ణ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్మంగా ఏజెంట్ సురేశ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ విధిగా తమ గహాలను ఏ విధంగా అయితే శుభ్రంగా ఉంచుకుంటారో అదే విధంగా తమ చుట్టూ ఉన్న పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ గుడ్డ సంచులను వాడాలని తెలిపారు. పర్యావరణానికి విఘాతం కలిగించే ప్లాస్టిక్ వాడకాన్ని ప్రజలంతా తమ వంతు భాద్యతగా నిర్మూలించాలని పేర్కొన్నారు. అనంతరం పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటు పడుతామని ప్రతిజ్ణ చేశారు
ఈ కార్యక్రమంలో పిట్ సెక్రటరీ రమేశ్‌రెడ్డి, అశోక్, అభిలాష్, రామకష్ణ, షబ్బిర్ అహ్మద్, సంక్షేమాధికారి హనుమంతారావు, అధిక సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు.