ప్రజా లక్ష్యం, కూకట్పల్లి( ఏప్రిల్ 5): కూకట్పల్లి నియోజకవర్గం లోని కెపిహెచ్బి కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు జోనల్ కమిషనర్ మమతాను కలిసి రేషన్ కార్డు లేని వారికి రేషన్ బియ్యం అందేలా చూడాలని కోరారు.
కరోన వ్యాధి మహమ్మారిని నియంత్రించే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు రాష్ట్రంలో లాక్ డౌన్ సందర్భంగా ఏ ఒక్కరూ తిండి లేకుండా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర గవర్నమెంట్ రేషన్ కార్డు ఉన్నవారికి 12 కిలోల బియ్యం, పదిహేను వందల రూపాయలు డబ్బులను అందజేస్తూ ఉన్నది.
రేషన్ కార్డు లేని వారికి ఇతర రాష్ట్రాల నుండి వచ్చి ఇక్కడ పని చేసుకుంటు పనులు లేక, రేషన్ కార్డు లేక నిత్యావసర సరుకులు లేక kphb డివిజన్ నందు సుమారు 3000 మంది కార్మికులు, కూలిపనులు చేసే వారిని గుర్తించామని డివిజన్ కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు జోనల్ కమిషనర్ మమత గారికి తెలియజేసారు.
ప్రతి ఒక్క వలస కార్మికుల కి రేషన్ వచ్చే విధంగా చూడాలని జోనల్ కమిషనర్ను కోరారు. దీనికి జోనల్ కమిషనర్ కూడా సానుకూలంగా స్పందించి రేషన్ కార్డు లేని ప్రతి ఒక్కరికి రేషన్ వచ్చే విధంగా చూస్తామని హామీ ఇచ్చారని అన్నారు. డివిజన్ trs పార్టి ఇంచార్జ్ ఆడుసుమిల్లి వెంకటేశ్వరరావు తో కలిసి సేకరించిన జాబితాను అందజేసి సత్వరమే వారికి ప్రభుత్వం నుండి అందే సహాయాన్ని వచ్చేలా చూడాలని కోరారు..