– నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పనకు కేటిఆర్ కృషి
– పట్టణంలో భారీ యువజన కవాత్
– ఉపపోరు ప్రచారంలో ముందున్న టిఆర్‌ఎస్.
– రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
హాలియా (నాగార్జునసాగర్) మార్చి 25ః ప్రపంచ దేశాల్లో పర్యటించి ఐటి పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రానికి రప్పించి యువతకు ఉద్యోగ కల్పనకు కృషి చేస్తున్న ఐటి శాఖామాత్యులు కేటిఆర్ రాష్ట్ర యువతకు స్ఫూర్తి దాయకమని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. బుధవారం హలియా పట్టణంలో భారీ యువజన కవాత్ర్యాలీని నిర్వహించారు.
అనంతరం ఏర్పాటు చేసిన యువజన కవాత్ ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే మాట్లాడారు… తెలంగాణను ఐటి హబ్గా మార్చలాన్న లక్ష్యంతో కేటిఆర్ శ్రమిస్తున్నరన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు కేటిఆర్ ఎంతగానో కృషి చేస్తున్నరన్నారు. టిఎస్ ఐపాస్ ద్వారా రాష్ట్రంలో పరిశ్రమలు నేలకోల్పి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేందుకు పాటుపడుతున్నారని పేర్కొన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్పై ప్రతిపక్ష నాయకులు చేస్తున్న ఆసత్య ఆరోపణలను టిఆర్ఎస్ శ్రేణులు తిప్పికొట్టాలన్నారు. కాంగ్రెస్, బిజేపి నాయకులకు పదవులపై ఉన్న అరాటం ప్రజా సమస్యలపైన లేదన్నారు. హలియాలోని యువతరం అంతా ఆదర్శవంత పాలన అందిస్తున్న టిఆర్ఎస్ పార్టీకి మద్దతుగా నిలిచేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.
పధకాలను విజయవంతంగా అమలు చేస్తూ బంగారు తెలంగాణగా మార్చేందుకు సిఎం కృషి చేస్తున్నారని తెలిపారు. అన్ని వర్గాలకు అండగా నిలుస్తున్న టిఆర్ఎస్పార్టీని రాబోవు ఉప ఎన్నికల్లో గెలిపించాలన్నారు.
హాలియా మున్సిపాలిటి 4వ వార్డులో ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించిన కోరుకంటి చందర్ అనంతరం 10వ వార్డులో బరోసా సమావేశంలో మాట్లాడారు.
కాగా క్షణం తీరిక లేకుండా స్థానికంగా అన్ని వర్గాల ప్రజలను కలుస్తూ ఆయ వార్డులలో ఏర్పాటు చేసిన బరోసా సమావేశంలలో ప్రభుత్వ అభివృద్ది, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ సంపూర్ణ మద్ధతు ఇవ్వాలని కోరుతున్నారు. స్థానికంగా ఏవైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. ఇలా విస్తృతంగా ప్రచారంలో ఎమ్మెల్యే చందర్ పాల్గొంటూ అటు ప్రజల మన్ననలు పొందుతూ ఇటు కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారు. టిఆర్ఎస్ విజయాన్ని ఖాయం చేస్తున్నారు.
ఈ కార్యక్రమంలో హలియా మున్సిపల్ చైర్మన్ పార్వతి శంకరయ్య, వైస్ చైర్మన్ సుధాకర్,రాష్ట్ర నాయకులు మలిగిరెడ్డి లింగారెడ్డి, విజేందర్ రెడ్డి, మహేందర్ రెడ్డి, కౌన్సిలర్ ప్రసాద్, వెంకటయ్య, శ్రీనివాస్ నాయకులు కాశయ్య, సైదులు, జగన్ మోహన్ రావు అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.