Home తెలంగాణ బీఆర్‌ఎస్‌ ముఖ్య అధికార ప్రతినిధిగా ‘మాదాసు’

బీఆర్‌ఎస్‌ ముఖ్య అధికార ప్రతినిధిగా ‘మాదాసు’

733
0
Madasu Chief Spokesperson of BRS
Ramagundam MLA Korukanti Chander handed over the appointment letter

– నియామక పత్రం అందజేసిన రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌

(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని ఏప్రిల్‌, 11: రామగుండం నియోజవర్గం భారత రాష్ట్ర సమితి ముఖ్య అధికార ప్రతినిధిగా మాదాసు రామమూర్తి నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ నియామక పత్రం అందజేసారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే చందర్‌ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పధకాలను ప్రతి గడపకు తీసుకువెళ్లాలని, బిఆర్‌ఎస్‌ పార్టీ అభివృద్ధికి కృషి చేయాలనీ, పార్టీ గెలుపే లక్ష్యంగా విస్తరణకు పాటు పడాలన్నారు. పార్టీ ముఖ్య అధికార ప్రతినిధిగా నియమించినందుకు ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌కు ఈ సందర్భంగా మాదాసు రామమూర్తి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ సంక్షేమ, అధివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు శక్తి వంచన లేకుండా కృషిచేస్తానని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు తోడేటి శంకర్‌ గౌడ్‌, మెతుకు దేవరాజ్‌, బోడ్డు రవీందర్‌, నారాయణదాసు మారుతి, చెలకలపల్లి శ్రీనివాస్‌, నూతి తిరుపతి, అల్లం రాజన్న తదితరులు పాల్గొన్నారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here