– దనరా శుభాకాంక్షలు తెలిపిన రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, 3 అక్టోబర్ః రామగుండం నియోజకవర్గం అభివృద్దే లక్ష్యంగా, సంక్షేమం ధ్యేయంగా ప్రజల సేవకే ఈ జీవితం అంకితంమని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పునరుద్ఘాటించారు. దసరా సందర్భంగా ప్రజలందరి ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్టాడుతూ… రామగుండం నియోజకవర్గం అన్ని రంగాలలో అభివృద్ది చేందేందుకు, ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు అందించేందుకు అహర్నిషలు కృషి చేస్తున్నానని తెలిపారు. ముఖ్యమంత్రి కేసిఆర్ తెలంగాణ ప్రజానీకం కోసం. అవిశ్రమంగా కృషి చేస్తున్నారని, తత్ఫలితంగానే కళ్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతు బంధు, రైతు భీమా దళితబందు లాంటి ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారన్నారు.
దశాబ్దాల కాలంగా రామగుండం ప్రజలు ఎదురుచూస్తున్న మెడికల్ కళాశాలను ఎర్పాటు కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ని ఓప్పించి మెప్పించి ప్రజల కళ సాకరం చేసి రామగుండంలో మెడికల్ కళాశాల ఎర్పాటు చేయుంచా మన్నారు. రాబోయే కాలంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఎలాంటి సమస్యలైనా వాటి పరిష్కారానికి అహర్నిషలు కృషి చేస్తానని ఈ సందర్భంగా పేర్కొన్నారు.