– జిల్లా కలెక్టర్ కె.శశాంక
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
కరీంనగర్, ఆక్టోబర్ 5: ప్రజా సమస్యలను ప్రథమ ప్రాధాన్యతతో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కె.శశాంక అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారు లతో కలిసి డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ఎంతో ఆశతో తమ సమస్యలు పరిష్కారం అవుతాయనే నమ్మకంతో డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమానికి ఫోను ద్వారా తెలుపుతారని, ఆ సమస్యలను ప్రథమ ప్రాధాన్యతగా తీసుకొని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా రామడుగు మండలం నుండి శ్రీనివాస్ ఫోన్ చేసి మా తండ్రి చనిపోవడం వలన ఆయన పేరు మీద ఉన్న భూమిని తల్లి పేరు మీదకి మార్చాలని ఫిర్యాదు చేయగా, కలెక్టర్ స్పందిస్తూ స్థలం దగ్గర ఉండి ఫోటో దిగి దానికి సంబంధించిన వివరాలు ఇస్తే పరిశీలించి పరిష్కరిస్తామని అన్నారు. రామడుగు మండలం కుక్కెరకుంట నుండి బత్తిని శంకరయ్య ఇంటి ప్రక్కనే ట్రాన్స్ ఫారం ఉండం వలన ప్రజలకు ఆటంకం కలుగుతుందని ఫిర్యాదు చేయగా, విద్యుత్ అధికారులకు చెప్పి సమస్య పరిష్కరిస్తామని అన్నారు.
డయల్ యువర్ కలెక్టరేట్ లో భాగంగా వచ్చిన ఫిర్యాదులు కమిషనర్, మున్సిపాలిటి, హుజురాబాద్ 1, కమిషనర్ మున్సిపల్ కార్పొరేషన్, కరీంనగర్ 1, సిఈవో, జిల్లా పరిషత్ 1, ఎస్ఈ, ఎన్.పి.డి.సి.ఎల్. 3, జిల్లా విద్యాధికారికి 4, పంచాయతి అధికారులకు 5, జిల్లా మెడికల్ మరియు హెల్త్ ఆఫీసర్ 2, డిస్ట్రిక్ట్ రూరల్ డెవలెప్ మెంట్ ఆఫీసర్ 1, డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ 2, ఆర్.డి.వో., కరీంనగర్ 2, తహశీల్దార్, సైదాపూర్ 2, తహశీల్దార్, కరీంనగర్ 1, తహశీల్దార్, రామడుగు 1, తహశీల్దార్ శంకరపట్నం 1, తహశీల్దార్, హుజురాబాద్ 2, తహశీల్దార్ , కరీంనగర్ రూరల్ 1, తహశీల్దార్, వీణవంక 3, వారధీ సోసైటీ 1. మొత్తం 34 ఫిర్యాదులు రాగా వాటిని సంబంధిత శాఖల వారిగా బదిలీ చేస్తూ పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వెంకట మాధవరావు, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్, డి.ఆర్.డి.వో. వెంకటేశ్వర్ రావు, డి.ఆర్.వో, వెంకట మాధవ రావు, జిల్లా విద్యాధికారి జనార్ధన్, ఎస్.సి. అధివృద్ది అధికారి బాల సుందర్, సి.పి.ఓ పూర్ణ చందర్, కలెక్టరేట్ పరిపాలనా అధికారి లక్ష్మారెడ్డి, కలెక్టరెట్ సూపరింటెండెంట్లు జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.