– సింగరేణి నాణ్యత వారోత్సవాల్లో జీఎం నారాయణ
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, నవంబర్ 12: నాణ్యమైన బొగ్గు ఉత్పత్తితోనే సింగరేణి సంస్థ అభివృద్ధి చెందుతుందని, నాణ్యత ప్రమాణాలే అభివృద్ధికి మూలాధారమని ఆర్జీవన్ జీఎం కల్వల నారాయణ అన్నారు. నాణ్యతను పెంచేందుకు కార్మికులు, సూపర్‌వైజర్లు, అధికారులు సమిష్టిగా కృషి చేయాలని ఆయన సూచించారు. సింగరేణిలో జరుగుతున్న బొగ్గు నాణ్యత వారోత్సవాల ఆర్‌జీ-1 జీఎం కార్యాలయ ఆవరణలో జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్బంగా జీఎం మాట్లాడుతూ బొగ్గు నాణ్యత ఆవశ్యకతను ఉద్యోగులకు వివరించారు. నాణ్యత లోపిస్తే జరిగే విపత్కర పరిస్థితులను కూడా ఆయన వివరించారు. ప్రస్తుతం బొగ్గు మార్కెట్‌ను తట్టుకునేందుకు నాణ్యత ప్రమాణాలు మరింత పెంచాల్సిన అవసరముంద న్నారు. వినియోగదారుల కోరిక మేరకు అనుకూలంగా బొగ్గును సరఫరా చేయడానికి సింగరేణి సంస్థ ఎప్పుడు సిద్దంగా వుందని ఆయన స్పష్టం చేశారు.
నాణ్యత విషయంలో ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక అవార్డులు పొందిన సింగరేణి సంస్థ మరింత స్పూర్తితో ముందుకు పోవడానికి సహకరించాలని ఉద్యోగులకు, కార్మికులకు సూచించారు.
ఈ సందర్బంగా క్వాలిటీ జీఎం సురేందర్ మాట్లాడుతూ సింగరేణి బొగ్గు నాణ్యత విషయంలో వినియోగదారులకు పూర్తి స్థాయిలో నమ్మకం వుందని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరముందన్నారు.
ఈ కార్యక్రమంలో సింగరేణి అధికారులు యం.త్యాగరాజు, మనోహర్, సలీం, గిరిధర్‌రాజు, రమేశ్, సలీం,సమ్మయ్య, సారంగపాణి, టీబీజీకేఏప్ పిట్ కార్యదర్శి ఇందూరి సత్యనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు.
జీడీకే.1 సీయస్పీలో…
సింగరేణి ఆర్‌జీ-1 పరిధి జీడీకే. సీయస్పీలో బొగ్గు నాణ్యత వారోత్సవాలు గురువారం నిర్వహించారు. నాణ్యత ప్రతిజ్ఞ, బొగ్గు నాణ్యత కొరకు తీసుకోవలసిన జాగ్రత్తలు అలాగే పోటీ పెరుగుతున్న సందర్భంలో సింగరేణి సంస్థను నాణ్యతలో నంబర్ 1గా ఉండాలన్నారు. ఉద్యోగులు అందరూ కష్టపడి పనిచేసి నాణ్యత గల బొగ్గును సరఫరా చేస్తే మనకు మంచి భవిష్యత్తు ఉంటుందని వక్తలు తెలియజేశారు. ముందుగా సి.యస్.పి హెచ్‌ఓడి దాసరి శ్రీనివాస్ చేతుల మీదుగా నాణ్యత వారోత్సవాల జెండా ఆవిష్కరణ జరిగింది.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సి.యస్.పి హెచ్‌ఓడి దాసరి శ్రీనివాస్, బూసా శ్రీనాథ్ ఇంజనీర్, మలేశం ఇంజనీరు , పిట్ సెక్రెటరీ గండు శ్రావణ్ కుమార్, జి.యం. కమిటీ మెంబర్ పుట్ట రమేష్, క్వాలిటీ డిపార్ట్మెంట్ ఇంఛార్జి గుళ్ల మల్లికార్జున్ గారు, రాజేందర్ గారు,ఆఫీసు స్టాఫ్ వేణు, పోశం,శ్రీనివాస్, ఫోర్ మెన్ రాజేందర్, ఉద్యోగులు పాల్గొన్నారు.
అదే విధంగా నాణ్యత వారోత్సవాలను జీడీకే.11వ గని, మేడిపల్లి ఓపెన్‌కాస్టు, జీడీకే.1,3 ఇంక్లయిన్, 2,2ఎతో పాటు అన్ని విభాగాల్లో నిర్వహించారు.