– హరిత హోటల్ నిర్మాణానికై భూమి కేటాయింపు
– రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని అక్టోబర్ 14: రామగుండం పారిశ్రామిక ప్రాంతం పర్యటక కేంద్రంగా రూపుదిద్దు కోనుందని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన మాట్లాడుతూ కాళేశ్వర ప్రాజెక్టు జలసిరితో ఎండిన గోదావరినది నిండుకుండలా సముద్రాన్ని తలపించేలా మారిందని తెలిపారు. ఈ క్రమంలో గోదావరినదిపై రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ కప్ పేర తెప్పల పోటీలు విజయవంతంగా చేపట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ప్రశంసలు పొందడం జరిగింద దన్నారు.
గోదావరినది తీరాన్ని పర్యటక కేంద్రంగా ఏర్పాటు చేయాలని, హరిత బడ్జెట్ హోటల్ నిర్మాణం చేపట్టాలని సిఎంను కోరడం జరిగిందన్నారు. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ ద్వారా రెవెన్యూ శాఖ అధికారులు మాల్కాపూర్ శివార్లోని సర్వే నెంబర్ 84లోని 12 గుంటల భూమిని జిల్లా టూరిజం అధికారులకు అందజేయడం జరిగిందని తెలిపారు. త్వరలో మాల్కాపూర్ శివార్లో హరిత బడ్జెట్ హోటల్ నిర్మాణానికై పనులు ప్రారంభకానున్నయని ఎమ్మెల్యే తెలిపారు.