– విజయమ్మ ఫౌండేషన్ ద్వారా పుస్తెమట్టెలు అందజేత
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని డిసెంబర్ 17, పేదరికంలో పుట్టిన యువతి వివాహానికి పెద్దన్నగా మారి వివాహానికి కావలిసిన పుస్తె, మట్టేలు సమకూర్చి మరోమారు మానవత్వాన్ని చాటు కున్నారు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని రెండో డివిజన్‌కు చెందిన తాటికొండ దివ్య వివాహం ఈ నెల 18వ తేదిన నిశ్చయమైంది. వివాహానికి ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే తన క్యాంపు కార్యాలయంలో విజయమ్మ ఫౌండేషన్ ద్వారా గురువారం పుస్తెమట్టెలు అందించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మాట్లాడుతూ రామగుండం నియోజక వర్గంలోని నిరుపేదలకు అండగా భరోసాగా నిలుస్తామని అన్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన దివ్య స్వయం ఉపాధి కోసం విజయమ్మ ఫౌండేషన్ ద్వారా ఉచితంగా కుట్టుమిషన్ అందజేస్తామని తెలిపారు.
సహాకారం అందించిన ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌కు దివ్య కుటుంబ సభ్యులు కతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గోలివాడ చంద్రకళ, గోలివాడ ప్రసన్న కుమార్ పాల్గొన్నారు.