– ఘనంగా ఎన్టీపీసీ రైజింగ్ డే-2020 ఉత్సవాలు..
– 43వ వసంతంలోకి రామగుండం-ఎన్టీపీసీ
– సిజిఎం సునీల్ కుమార్
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, నవంబర్ 14: దేశ నిర్మాణంలో గత 42 సంవత్సరాలుగా రామగుండం ఎన్టీపీసీ ముఖ్య భూమికను పోషిస్తున్నదని సిజిఎం (రామగుండం & తెలంగాణ) సునీల్ కుమార్ పేర్కొన్నారు. రామగుండం-ఎన్‌టిపిసి 43 వ రైజింగ్ డే-2020 శనివారం రోజున ఘనంగా జరిగింది. కోవిడ్ మార్గదర్శకాలకు పాటిస్తూ చాలా ఉత్సాహంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిజిఎం హాజరై జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సిజిఎం సునీల్ కుమార్ మాట్లాడుతూ… రామగుండం ఎన్టీపీసీ ప్లాంట్ అద్భుతమైన ప్రయాణంసాగిస్తూ గత 42 సంవత్సరాలుగా దేశ నిర్మాణంలో వెలుగులు విరజిమ్ముతూ సహకారం అందిస్తుందని తెలిపారు. రామగుండం- ఎన్టీపీసీ పనితీరు, సరికొత్త్త కార్యక్రమాలతో ముందుకు సాగుతోందన్నారు. సిఎస్‌ఆర్, పర్యావరణం, భద్రత, కోవిడ్ కేర్ మేనేజ్‌మెంట్, టౌన్‌షిప్ సౌకర్యాలు, మానవ వనరుల అభివద్ధిలో రామగుండం ప్రాజెక్టు ఎంతో ప్రగతి సాధించిందన్నారు.
త్వరలోనే తెలంగాణ ప్రాజెక్ట్ ఫేజ్ -1 (2 x 800 మెగావాట్లు) ఉత్పత్తి దశకు చేరుకుం టుందని తెలిపారు. 100 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ పివి ప్రాజెక్ట్‌ను ప్రారంభించేందు సన్నాహాలు జరుగుతున్నట్లు తెలిపారు.
ప్రధాన వక్తలు మాట్లాడుతూ రామగుండం-ఎన్టీపీసీ ప్రయాణం, దేశ విద్యుత్ రంగంలో ఈ ప్రాజెక్టు అందించిన సహకారాన్ని వివరించారు. ప్రభావిత ప్రాంతాల అభివద్ధికి ఎన్టీపీసీ ఎంతగానో కృషి చేస్తుందని తెలిపారు.
ఈ సందర్భంగా అధికారులు రైజింగ్‌డే కేక్ కట్ చేశారు. విజిలెన్స్ అవేర్‌నెస్ వీక్ -2020 సందర్భంగా జరిగిన వివిధ పోటీల విజేతలకు అవార్డులను సిజిఎం అందజేసారు. సిజిఎం సునీల్ కుమార నేతత్వంలో టౌన్ షిప్‌లో మొక్కలు నాటారు.
ఈ కార్యక్రమంలో ఎన్‌టిపిసి, సిఐఎస్‌ఎఫ్‌కు చెందిన సీనియర్ అధికారులు, వివిధ యూనియన్లు, అసోసియేషన్ల ఆఫీస్ బేరర్లు, ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.