కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన కరోనా లాక్ డౌన్ ను దృష్టిలో ఉంచుకోని తన నియోజకవర్గంలో నీరుపేద ప్రజలు ఎవరు అన్నం లేకుండా అలమటించవద్దు అన్న ఆలోచనతో కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణా రావు పిలుపు మేరకు కూకట్ పల్లి నియోజకవర్గం..ఓల్డ్ బోయిన్ పల్లి డివిజన్ లో ఉన్న సర్వదామా నగర్ వెల్పేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సుమారు 200 క్వింటాల్లా..రెండు లారీల రైస్(బియ్యం)ను వారి సొంత డబ్బులతో ఎమ్మెల్యే మాధవరం కిష్ణా రావు కు అందించారు.
సర్వదామా నగర్ వెల్పేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 200 క్వింటాలు బియ్యం
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం మాట్లాడుతూ కూకట్ పల్లి తన నియోజకవర్గం తోపాటు తెలంగాణ రాష్ట్రం లో ఎవరు బువ్వ లేక ఉండవద్దు అన్న సీఎం కేసీఆర్ పిలుపు మేరకు తన నియోజకవర్గ పరిధిలో ఉన్న అన్ని డివిజన్స్ కార్పొరేటర్స్ కు తెల్పడం తో వారివారి కాలనీబస్తీలల్లో ఉన్న దాతల దృష్టికి తీసుకెళ్ళాడముతో వారు పెద్ద మనస్సు తో 200 క్వింటాల్లా బియ్యం అందించినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఇలా మనసున్న ప్రతి ఒక్కరు ఈ విపత్కర పరిస్థిలో ముందుకు వచ్చి వస్తునగదు రూపంలో తమ వంతు సహయ సహకారాలు అందించాలని కోరారు.
నేను కూడా తమ సొంత ఖర్చులతో తన నియోజకవర్గంలో అన్ని డిజన్స్ కు 2000 ల క్వింటాల్లా బియ్యం,పప్పు,నూనె,చింతపండు,కూరగాయల తోపాటు ఇతర కిరాణా సామాన్లు పంపినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బోయిన్పల్లి కార్పొరేటర్ ముద్దం నర్సింగ్ యాదవ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ గౌడ్, నర్సింగ్, తదితరులు పాల్గొన్నారు.
4000 కేజీల బియ్యము, 200 కేజీల పప్పు ను అందజేసినలోధా మెరిడియన్ వాసులు
ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారి పిలుపు మేర ఈ కరోనా మహమ్మారి చేసే విపత్కర పరిస్థితులలో మన నియోజక వర్గం పేద ప్రజలను ఆదుకోవడానికి తమ వంతు లోధా సహాయంగా 4000 కేజీల బియ్యమును మరియు 200 కేజీల పప్పు ను నిరుపేద ప్రజలకు సహాయం చేయడానికి రమేష్ దేవా అద్వర్యం లో లోధా మెరిడియన్ లో విరాళాలు సేకరించి, అందరినీ కలిసి ఎమ్మెల్యే ఇచ్చిన ఆదేశాల మెరకు విరాళాలు సేకరించారు.వచ్చిన డబ్బులను లోధా మెరిడియన్ అసోసియేషన్ వారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సమక్షం లో చెక్ అందజేశారు.
ఈ సమావేశము లో తెరాస నాయకులూ (తెరాస NRI USA ఇంచార్జి ) రమేష్ దేవా గ, లోధా ప్రెసిడెంట్ సుధాకర్ నాగతోట , ఉపేంద్ర సింగారి , సురేష్ బాబు, రామరాజు పాల్గొన్నారు. ఇందుకు సహకరించిన సాక్షి రిపోర్టర్ రవీందర్ రెడ్డి, టీ న్యూస్ రిపోర్టర్ రంజిత్ కు లోధా మెరిడియన్ తరుపున కృతజ్ఞతలు తెలుపారు.