– సింగరేణి డైరెక్టర్ సత్యనారాయణ
(ప్రజాలక్ష్యం కోల్‌బెల్ట్ ప్రతినిధి)
గోదావరిఖని, అక్టోబర్ 17: రాబోవు కాలంలో సింగరేణి సంస్థలో సోలార్ విద్యుత్పత్తిని ప్రోత్సహిస్తుందని తదనుగుణంగా ప్రాజెక్టులను చేపడుతుందని డైరెక్టర్ (ఈఅండ్‌ఎం) సత్యనారాయణ అన్నారు. శనివారం ఆర్‌జీ-1 జీఎం కార్యాలయంలోని సమావేశ మందిరం లో వివిధ విభాగాల అధికారులతో సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి డైరెక్టర్ సత్యనారాయణ హాజరయ్యారు. ముందుగా జీడీకే.11వ గనిలో మ్యాన్‌రైడింగ్ సిస్టం, చైర్‌లిప్ట్‌కార్ పొడగింపు, సోలార్ సిస్టం గురించి జీఎం కల్వల నారాయణతో చర్చించారు.
అనంతరం సత్యనారాయణ మాట్లాడుతూ రాబోవు కాలంలో ఎక్కువ శాతం సోలార్ పవర్ సిస్టం ద్వారా విద్యుత్పత్తిని తీసే విధంగా ప్రోత్సహిస్తామన్నారు. ప్రస్తుతం బొగ్గు పరిశ్రమతో నడుస్తున్న థర్మల్ విద్యుత్ వాడకాన్ని తగ్గిస్తామన్నారు. సింగరేణి సంస్థలో పెద్ద మొత్తంలో సోలార్ పవర్ ప్రాజెక్టులను నిర్మిస్తామన్నారు. సాధ్యమైనంత మేర విద్యుత్ వినియోగాన్ని తగ్గించాలని, అందుకు అనుగుణంగా సింగరేణి అధికారలు సిద్దం కావాలన్నారు.
ఈ సమీక్ష సమావేశంలో సింగరేణి అధికారులు యం.సురేష్, ఎ.మనోహర్, బెనర్జీ బెంజిమెన్, మురళీదర్, మదన్‌మోహన్, రాందాస్, కాశివిశ్వేశ్వర్, రామకృష్ణరావు, యస్.రమేశ్ తదితరులు పాల్గొన్నారు.