– బీజేపీ రాష్ట్ర మాజీ కార్యదర్శి ఎస్.కుమార్
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, అక్టోబర్ 20: ఎన్టీపీసీ భూనిర్వాసితులు సమస్యలను పరిష్కరించాలని బీజేపి సీనియర్ నాయకులు, రాష్ట్ర మాజీ కార్యదర్శి ఎస్. కుమార్ కోరారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డిని మంగళవారం న్యూఢిల్లీలోని హోమ్ శాఖ కార్యాలయంలో కలసి వినతి పత్రాన్ని అందజేసారు.
ఎన్నో ఏండ్లుగా ఎన్టీపీసీ భూనిర్వాసితుల ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్క రించాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని కోరారు. అదే విధంగా రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి సంబంధించిన పలు విషయాలను చర్చించారు.