– రెడ్డి బిజినెస్ గ్రూప్ ఫౌండర్ ఏనుగు శ్రీనివాస్ రెడ్డి
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
హైదరాబాద్ డిసెంబర్ 11ః పరస్పర సహకారంతో ఆలోచనలను బదిలి చేసుకోవడం ద్వారా వ్యాపారాభివృద్ధిని పెంపొందించుకోవచ్చని రెడ్డి బిజినెస్ గ్రూప్ ఫౌండర్ ఏనుగు శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం రోజు హైదరాబాద్ ఎమ్మెల్యే కాలనీ క్లబ్ లో రెడ్డి బిజినెస్ గ్రూప్ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా ఏనుగు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ వ్యాపార రంగంలో అవకాశాలు అందిపుచ్చుకోవడం కోసం రెడ్డి కమ్యూనిటీ లోని వ్యాపారస్తులు ఒకరినొకరు సహకరించుకోవడం ద్వారా వ్యాపారాభివృద్ధితో పాటు రెడ్డి కమ్యూనిటిలో తత్సంబంధాలు ఏర్పడతాయని తెలిపారు. అదే లక్ష్యంతో ఈ రెడ్డి బిజినెస్ గ్రూప్ ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అంతే కాకుండా రెడ్డీస్ స్థాపించే కంపెనీల్లో రెడ్డి యువతకు ఎక్కవ శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతుందని పేర్కొన్నారు.
ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో రెడ్డి బిజినెస్ గ్రూప్ కు చాలా మంది తమ వంతుగా ప్రోత్సాహాన్ని అంది అందిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వాలు ఏమో చేస్తాయనే భ్రమలో వుండకుండా రెడ్డి బిజినెస్ గ్రూప్ ద్వారా వివిధ రంగాల చెందిన నిపుణులు పరస్పర సహకారంతో తమ తమ ఆలోచనలను, అనుభవాలను పంచుకోవడం ద్వారా ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చని పేర్కొన్నారు. రెడ్డి బిజినెస్ గ్రూప్‌లో ముందుకు తీసుకెళ్లేందుకు అందరు సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా వ్యాపార వేత్తలు, వివిధ రంగాలకు చెందిన నిపుణులు తమ అమూల్యమైన సూచనలు, సలహాలు అందజేసారు.
రెడ్డి బిజినెస్ గ్రూప్ ఫౌండర్ ఏనుగు శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్య్రక్రమంలో రిటైర్డ్ చీఫ్ బ్యాంక్ మేనేజర్ ఆర్ దామోదర్ రెడ్డి, గూడూరు టైల్సు అధినేత రవీంద్ర రెడ్డి, సీనియర్ పాత్రికేయులు మహిపాల్ రెడ్డి, సీనియర్ ఇన్సూరెన్సు అడ్వైజర్ వెంకట్రాంరెడ్డి, సివిల్ ఇంజనీర్ & బిల్డర్ కె ఆగా రెడ్డి, అంక్యుపక్షర్ హీలర్ అండ్ కంగన్ ఎంటర్ ప్రైజర్ డాక్టర్ వజ్రాల శ్రీనివాస్ రెడ్డి, అవినాష్ మ్యారేజ్ గ్రూప్ డి.వి. కోటిరెడ్డి, హెచ్. శ్రీనాథ్ రెడ్డి వివిధ రంగాల చెందిన పలువురు నిపుణులు పాల్గొన్నారు.