(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, అక్టోబర్ 7: మహాత్మా గాందీ 151వ జన్మదినాన్ని పురస్కరించుకుని నీరు, పారిశుధ్యం, పరిసారాలు పరిశుభ్రంగా ఉంచుకోవడానికి స్వచ్చతా హి సేవా-2020 కార్య క్రమాన్ని పురష్కరించుకొని సింగరేణలో స్వచ్చత మాసోత్సవాలు కొనసాగుతున్నాయి. అందులో భాగంగా జీడీకే.2ఎ గని ఆవరణలో బుధవారం స్వచ్చతా కార్యక్రమాన్ని నిర్వహిం చారు. మేనేజర్ సాయి ప్రసాద్ హాజరై ఉద్యోగులను స్వచ్చతా ప్రతిజ్ణ చేయించారు.
ఈ సందర్భంగా మేనేజర్ సాయి ప్రసాద్ మాట్లాడుతూ స్వచ్చతా హి సేవా ఒక గొప్ప కార్యక్రమమన్నారు. గాందీ కళలుకన్న భారత దేశ నిర్మాణంలో స్వచ్చతా మాసోత్సవాలు ముఖ్య భూమికను పోషింస్తున్నదని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ విధిగా గృహాలను ఏ విధంగా అయితే శుభ్రంగా ఉంచుకుంటామో, మన చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిస్తూ, ప్రతి ఒక్కరూ గుడ్డ సంచులను వాడాలని సూచించారు. పర్యా వరణకు పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని తెలిపారు. అనంతరం పర్యావరణ పరి రక్షణకు ప్రతి ఒక్కరూ పాటు పాడాలని ప్రతిజ్ణ చేశారు.
ఈ కార్యక్రమంలో పిట్ కార్యదర్శి డి.మల్లయ్య, సేఫ్టీ ఆఫీసర్ దాసరి వెంకటేశ్వర్లు, 2ఎ సెక్షన్ ఇంచార్జీ టి.శంకర్, వెంటిలేషన్ ఆఫీసర్ సల్మాన్ ఖాన్, సంక్షేమాధికారి కిరణ్ కుమార్, అధిక సంఖ్యలో ఉధ్యోగులు పాల్గొన్నారు .