– టియుఎఫ్ ప్రథమ వార్షికోత్సవ సభలో చైర్మన్ చీమ శ్రీనివాస్
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
హైదరాబాద్, సెప్టెంబర్ 28: తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో తెగించి కొట్లాడి రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమకారుల సంక్షేమమే పరమావధిగా ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డు వెంటనే ఏర్పాటు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర చైర్మన్ చీమ శ్రీనివాస్ కోరారు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మంగళవారం తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ప్రథమ వార్షికోత్సవ సభ ఘనంగా నిర్వహించారు. ఈ సభకు తెలంగాణలోని అన్ని జిల్లాల నుండి ఉద్యమకారులు హాజరైనారు.
ఈ సందర్భంగా రాష్ట్ర చైర్మన్ చీమ శ్రీనివాస్ మాట్లాడుతూ… రాష్ట్ర సాధన కోసం జరిగిన మలిదశ ఉద్యమంలో తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులు, కార్మికులు, సబ్బండ వర్గాలు స్వచ్చందంగా పాల్గొన్నారని తెలిపారు. ఈ క్రమంలో అనేక మంది తమ జీవనాధారమైన చిన్న చిన్న వ్యాపారాలను, వృత్తులను, ప్రైవేటు ఉద్యోగాలను వదిలిపెట్టి ఉద్యమించారని పేర్కొన్నారు. అమరవీరుల త్యాగాలు, ఉద్యమ కారుల ఉద్యమాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించు కున్నామనే విషయాన్ని గుర్తుచేసారు.
రాష్ట్రం సిద్ధిస్తే తమ బతుకులు బాగుపడడమే కాకుండా భావి తరాలు ఎంతో ఉన్నతంగా వుంటాయని భావించిన ఉద్యమ కారులు తమ జీవితాలను పణ్ణంగా పెట్టి పోరాడి రాష్ట్రాన్ని సాధించుకున్న అందరికి తెలిసిన విషయమేనన్నారు. ఉద్యమంలో పాల్గొన్న పేద, మద్య తరగతి, బడుగు బలహీన వర్గాల ప్రజలు నేడు రాష్ట్రం సిద్ధించి ఆరు సంవత్సరాలు గడచినప్పటికీ దయనీయ పరిస్థితిలో కొట్టుమిట్డాడుతున్నారని పేర్కొన్నారు.
ఇప్పటికైనా ఈ పరిస్థితి చక్కదిద్దేందుకు ప్రభుత్వం ముందుకు రావాలని కోరారు. ప్రభుత్వము రాష్ట్ర సాధన కోసం ఉద్యమంతో ప్రత్యక్షంగా పాల్గొన్న ఉద్యమ కారులందరిని తెలంగాణ స్వాతంత్య్ర సమరయోధులుగా గుర్తించి గౌరవించాలన్నారు. ఉద్యమకారులకు తగిన గుర్తింపునిచ్చేందుకు తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డు వెంటనే ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ బోర్డు ద్వారా ఉద్యమకారుల స్థితిగతులను గుర్తించి వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించి న్యాయం చేయాలని ఈ సందర్భంగా ప్రభు త్వానికి విజ్ఞప్తి చేసారు. ఈ సంక్షేమ బోర్డు ఏర్పాటు ఉద్యమకారుల ఆత్మగౌరవ వేదికగా వుంటుందని తెలిపారు.
రాష్ట్ర గౌరవ చైర్మన్ బి. ముత్తయ్య మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారుల వేదిక గడచిన సంవత్సరా కాలంగా ఎంతో పురోభివృద్ధి సాధించిందని తెలిపారు. సంక్షేమ బోర్డు కోసం ఎమ్మెల్యేలను, ఎంపిలను, రాజకీయ పక్షాల నాయకులను కలిసి ఫోరం వినతి పత్రాలను సమర్పించిందని తెలిపారు. ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఆవశ్యకతను ప్రజల్లోకి తీసుకెళ్లిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రసాధనోద్యంలో పాల్గొన్న ప్రతి ఉద్యమకారుడు ఫోరంతో భాగస్వామ్యం కావాలని కోరారు.
రాష్ట్ర కన్వీనర్ గొల్లపల్లి నాగరాజు మాట్లాడుతు… ఉద్యమకారులు గత ఆరు సంవత్సరాలుగా ఎలాంటి గుర్తుంపు లేక చాలా ఆవేదనతో ఉన్నారని తెలిపారు. దానికి ప్రత్యక్ష సాక్షమే ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన నాగులు ఆత్మహత్య చేసుకొని మరణించడమే అని తెలిపారు. అందుకోసం మన ఉద్యమకారుల ఫోరం పక్షాన చితికిన ఉద్యమకారులను ఆదుకునే ప్రయత్నం చేయాలన్నారు. అందుకోసం ఉద్యమకారులు ముందుకు రావాలని కోరారు.
రాష్ట్ర కోఆర్డినేటర్ గోలి సమ్మిరెడ్డి మాట్లాడుతూ… రాజకీయాలకు అతీతంగా ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటే ఏకైక లక్ష్యంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఏర్పడిందని తెలిపారు. సామ, దాన, భేద, దండోపాయాల ద్వారానైన సంక్షేమ బోర్డు సాధించుకోవాలని అన్నారు. తెలంగాణలోని ఉద్యమకారుల స్థితిగతులపై అధ్యయనం చేసి వారి వివరాలను సేకరించాలని కోరారు.
ఉమ్మడి పది జిల్లాలకు కోఆర్డినేటర్ల నియామకం
తెలంగాణ ఉద్యమకారుల ఫోరమ్ నిర్మాణంలో భాగంగా రాష్ట్రంలోని 33 జిల్లాల కమిటీలు వేయాలని నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా ఉమ్మడి పది జిల్లాలకు కోఆర్డి నేటర్‌లను ఈ సందర్భంగా నియమించారు. ఉమ్మడి జిల్లాల కోఆర్డినేటర్లుగా ఆదిలాబాద్ దుర్గం రవీందర్, కరీంనగర్ చాంద్ పాషా, నిజామాబాద్ భాస్కర్, మెదక్ చిట్యాల దేవయ్య, మహబూబ్‌నగర్ కాడం శ్రీనివాస్, రంగారెడ్డి కొంతం యాదిరెడ్డి, నల్లగొండ ఆనంతుల మధు, ఖమ్మం కె.వి. కృష్ణారావు, వరంగల్ రామకృష్ణ, హైదరాబాద్ పి. సురేందర్ రెడ్డిలను నియమించారు. నూతనంగా ఎన్నికైన కోఆర్డినేటర్లు తమను నియ మించినందులకు రాష్ట్ర కమిటికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమపై వుంచిన బాధ్యతను శక్తివంచలేకుండా కృషిచేస్తామని తెలిపారు.
ఈ సందర్బంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కొన్ని తీర్మాణాలను ఏకగ్రీవంగా ఆమోదించింది. తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డు”ని వెంటనే ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కి విజ్ఞాప పత్రం అందజేయడం. ఇటీవల మరణించిన తెలంగాణ నాగులు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. గ్రేటర్ హైదరాబాద్ డబుల్‌బెడ్ రూమ్ గృహాలలో ఉద్యమకారులకు ప్రాధాన్యత ఇవ్వాలి. గ్రేటర్ ఎన్నికలలో అన్ని రాజకీయ పార్టీలు ఉద్యమకారులకు ప్రాధాన్యతనిస్తూ అవకాశం కల్పించాలి.
ఈ కార్యక్రమంలో రాష కమిటి సభ్యులు కృస్ణమాచారి, వీరస్వామి, జంగ సుదర్శన్, రాంబాబు, సోమయ్య, జనిగె విష్ణువర్ధన్, చాడ లింగం, గుప్త, కోదాటి శ్యాంసుందర్ ఓయు విద్యార్థి నాయకులు నర్సింహా, వివిధ జిల్లాల నుండి వచ్చిన ఉద్యమారులు పాల్గొన్నారు.
Super ……………..
Thank you brother