– రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, డిసెంబర్ 16: తెలంగాణ రాష్ట్రంలోని అన్ని కులాలకు అన్ని మతాలకు అండగా టిఆర్‌ఎస్ ప్రభుత్వం నిలుస్తుందని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రామగుండం నియోజకవర్గానికి చెందిన పాస్టర్లతో ఎమ్మెల్యే సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం హిందువులకు బతుకమ్మ చీరలు, ముస్లీంలకు రంజాన్ కానుకలను, క్రిస్టియన్లకు క్రిస్మస్ కానుకల అందించడం జరుగుతుందన్నారు. ఈ నెల 21వ తేదిన క్రిస్మస్ వేడుకలు కన్నల పండుగగా నిర్వహించ నున్నామన్నారు.
ఈ ప్రాంతంలోని నిరుపేద మహిళలకు స్వయం ఉపాధి కల్పన కోసం విజయమ్మ పౌండేషన్ ఆధ్వర్యంలో మహిళా సాధికారత కేంద్రాలను ఉచితంగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 50వ డివిజన్‌లో కుట్టుమిషన్ సెంటర్ లు నెలకొల్పి మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. అదే విధంగా చర్చిల్లో ఉచితంగా కుట్టుమిషన్ సెంటర్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రాంతంలోని క్రిస్టియన్లకు అండగా ఉంటామని అన్నారు.
ఈ సమావేశంలో రామగుండం నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, పాస్టర్లు బిషప్ జాన్ సుందర్, తిమెతిపాల్, ప్రేమ్ కుమార్, సుదర్శనం, నీరిక్షన్, స్వాతిక్ సాంసన్, మహిపాల్, దయానంద్ గాంధీ, యాసర్ల తిమెతి తదితరులు పాల్గొన్నారు.