– రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
హైదరాబాద్, నవంబర్ 29ః హైదరాబాద్ గ్రేటర్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో తెరాస పార్టీ విజయం సాధించి మరోమారు జీహెచ్ఎంసీపై గులాబీజెండా ఎగురవేయడం ఖాయమని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. ఆదివారం హైదరాబాద్ లో ఎమ్మెల్యే క్వార్టర్్స ఆవరణలో రామగుండం నియోజకవర్గ ప్రజాప్రతినిధులు నాయకులుతో ఎమ్మెల్యే సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలో సిఎం కెసిఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ అభివృద్ధి పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు. టీఆర్ఎస్ పార్టీతోనే మహా నగరాల అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కోన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్బంగా తెరాస అధిష్టానం తమకు 137వ డివిజన్ బాధ్యతలను అప్పగించడం జరిగిందని అన్నారు. తమకు అప్పగించిన డివిజన్లో తెరాస పార్టీ భారీ మెజార్టీతో విజయం సాధిస్తుందని తెలిపారు. రామగుండం నియోజకవర్గం నుండి 300 మంది టీఆర్ఎస్ శ్రేణులు ఇక్కడికి రావడం జరిగిందన్నారు.
137 వ డివిజన్లలో 10 రోజుల పాటు నిత్యం తన వెంట ఉంటూ టి.ఆర్.ఎస్ ఆభ్యర్ది విజయం కోసం శ్రమించిన ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలకు ఎమ్మెల్యే ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సమావేశంలో రామగుండం నగర మేయర్ డాక్టర్ బంగీ అనిల్ కుమార్ డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావుతోపాటు కార్పోరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, సమన్వయ కమిటీ సభ్యులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.