Home తెలంగాణ మహిళలు స్వయం ఉపాధి తో ఎదగాలి – 33 కార్పొరేటర్

మహిళలు స్వయం ఉపాధి తో ఎదగాలి – 33 కార్పొరేటర్

699
0
33 Corporator inaugurated tailoring training center

(ప్ర‌జాల‌క్ష్యం ప్ర‌తినిధి)
హైద‌రాబాద్‌, న‌వంబ‌ర్ 19: రామగుండం మున్సిపల్ పరిధిలో స్థానిక 33 డివిజన్ విజయమ్మ ఫౌండేషన్ లో మహిళా సాధికారత స్వయం ఉపాధి కల్పన ఆడపడుచులకు కుట్టు మిషన్ కేంద్రాన్ని కార్పొరేటర్ దొంత శ్రీనివాస్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందుండి ఎవరిమీద ఆధారపడకుండా స్వయం ఉపాధితో, స్వశక్తితో ఎదగాలని, అలాంటి సంకల్పం గల మహిళలకు విజయమ్మ ఫౌండేషన్ అండగా ఉంటుందని.. అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉండాలనేదే విజయమ్మ పౌండేషన్ ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో విజయమ్మ ఫౌండేషన్ సభ్యులు దొంత కవిత శ్రీనివాస్, శ్రీలక్ష్మి సతీష్, అలేఖ్య, Rpరాజకుమారి, MDరహీమా, యుగంధర్, లేగిన్, ఉమామహేశ్వర్ మరియు డివిజన్ ప్రజలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here