బీజేపీ రాష్ట్ర నాయకులు ఎస్.కుమార్
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
హైదరాబాద్, నవంబర్ 19ః గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ( జిహెచ్ఎంసి) ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని ఓడించి, బీజేపీ కార్పోరేట్ అభ్యర్థులను గెలిపించేందుకు ప్రతి కార్యకర్త కృషిచేయాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు ఎస్. కుమార్ పిలపు నిచ్చారు. గురువారం బన్సీలాల్ పేట్ డివిజన్లోని బూత్ కమిటీ నాయకులతో ఆయన సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఎస్. కుమార్ మాట్లాడుతూ… టిఆర్ఎస్ పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, వారంతా బీజేపీ వైపు చూస్తున్నారని చెప్పారు. దుబ్బాక ఎన్నికల ఫలితమే ఇక్కడ కూడా రాబోతుందని పేర్కొన్నారు. అందుకు కార్యకర్తలంతా ఆ విజయం కోసం కృషిచేయాలని తెలిపారు.
నరేంద్రమోదీ నాయకత్వములో దేశం అభివృద్ధి పథంలో పయనిస్తుందని ఆయన వివరించారు.. తెలంగాణ లో టిఆర్ఎస్ అవినీతి లో కూరుకు పోయిందని చెప్పారు. నిరంకుశ పాలకు చరమగీతం పాడాల్సిన అవసం ఎంతైనా వుందని తెలిపారు. ప్రతి కార్యకర్త జిహెచ్ఎంసి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించేందుకు పాటుపడాలని కోరారు.
సీసీనగర్, బోలకపూర్, హమ్మలి బస్తి, అభినవ్ నగర్ కాలనీ, బలరాం కాంపౌండ్, బోయగూడా బస్తీల్లో ఎస్. కుమార్ పర్యటించి కమిటీల పనితీరును పరిశీలించారు..
ఈ సమావేశంలో బన్సీలాల్ పెట్ బీజేపీ ప్రెసిడెంట్ ఉమేష్ హానెడల్ వాల్, టి. రాజా శేఖర్ రెడ్డి, వై. సురేష్కె, కృష్ణ, ఆనంద్ యాదవ్, సత్యనారాయణ గౌడ్, శివ, పవన్ పటేల్, తదితరులు హాజరయ్యారు..