Home తెలంగాణ సొంతగూటికి చేరిన ‘గోగుల’

సొంతగూటికి చేరిన ‘గోగుల’

740
0
Joining in BJP
Gogula Ravinder Reddy jointing in BJP at presence of District President Somarapu Satyanarayana

ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, సెప్టెంబర్ 24: రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో సీనియర్ నాయకుడిగా కొనసాగుతున్న గోగుల రవీందర్రెడ్డి టిఆర్ఎస్ కు రాజీనామా చేసి సొంతగూటికి చేరారు. ఈ మేరకు స్తానిక శివాజీనగర్ లోని  కార్యాలయంలో గురువారం జిల్లా అధ్యక్షుడు సోమారపు సత్యనారాయణ కండువా కప్పి బీజేపిలోకి ఆహ్వానించారు. రామగుండం పారిశ్రామిక ప్రాతంలోనే కాక ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే సీనియర్ నాయకుడిగా పేరున్న గోగుల రవీందర్ రెడ్డి ఇటీవలే టిఆర్ఎస్ లో చేరారు.

గోగుల రవీందర్ రెడ్డి గతంలో బీజేపీలో క్రియాశీలక నాయకునిగా కొనసాగుతూ ఎన్నో కీలక పదవులు నిర్వహించి పార్టి పురోగతికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. రామగుండం ఏరియాలో భారతీయ జనతా పార్టి పునాదులు వేసిన ముఖ్యులలో గోగుల ప్రముఖుడు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఎన్నో స్వచ్చంద కార్య క్రమాలు నిర్వహించిన గోగుల రవీందర్ రెడ్డికి బీజీపీ రాష్ర్ట, జిల్లా స్థాయి నాయకులతో మంచి సంబంధాలున్నాయి.

కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా వుంటున్న గోగుల రవీందర్ రెడ్డి ఇటీవలే టిఆర్ఎస్ లో చేరారు. టిఆర్ఎస్ ను వీడి సొంత గూటికి చేరిన గోగులను బీజేపీ నాయకులు అభినందిస్తూ, సాదరంగా స్వాగతం పలికారు. కాగా బీజీపేలో చేరడంతో గోగుల రవీందర్ రెడ్డి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ రాష్ట్ర నాయకులు ఎస్ కుమార్, కార్పొరేషన్ నాయకులు బల్మూరు అమరేందర్రావు, వడ్డేపల్లి రామచందర్, కార్పొరేటర్ లలిత మల్లేష్, వెంకటరమణ, స్వామి, వెంకటేశం, మామిడి రాజేష్, యాదగిరి, గాండ్ల స్వరూప లతోపాటు కార్పొరేషన్ లోని బిజెపి మండల అధ్యక్షులు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here