Home తెలంగాణ చెన్నాపురంలో అడవిలో ఎన్‌కౌంటర్‌

చెన్నాపురంలో అడవిలో ఎన్‌కౌంటర్‌

550
0
encounter

ముగ్గురు మావోయిస్టుల మృతి

(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
కొత్తగూడెం, సెప్టెంబర్‌ 23: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం చెన్నాపురం అటవీ ప్రాతంలో బుధవారం రాత్రి జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ ఒక ప్రకటన విడుదల చేశారు.

తెెలంగాణ రాష్ట్ర మావోయిస్టు పార్టీ కమిటీ ఈనెల 21 నుండి 27 వ తారీఖు వరకు పార్టీ ఆవిర్భావ దినోత్సవ వారోత్సవాలలో భాగంగా తెలంగాణలో విధ్వంసం సష్టించడానికి చాలా యాక్షన్‌ టీంలను, మావోయిస్టు దళాలను చత్తీష్‌గఢ్‌ రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న ప్రాంతాలకు పంపించినట్లుగా అందిన సమాచారం మేరకు జిల్లాలోని చర్ల, మణుగూరు అటవీ ప్రాంతాల్లో పోలీసు బలగాలు కూంబింగ్‌ ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నాయి.

అందులో భాగంగా చర్ల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని చెన్నాపురం అటవీ ప్రాంతంలో కూంబింగ్‌ జరుపుతుండగా మావోయిస్టులు తారసపడడంతో మావోయిస్టులు పోలీసుల మద్య ఎదురుకాల్పులు జరిగాయి. సంఘటనా స్థలంలో ముగ్గురు మావోయిస్టుల మృతదేహాలు లభ్యమయ్యాయి. వీరిలో ఇద్దరు మహిళా ఇద్దరు మహిళా మావోయిస్టులు కాగా ఒక మగ మావోయిస్టుగా గుర్తించారు. మృతదేహాల వద్ద నుంచి ఒక 8 ఎంఎం రైఫిల్‌, పేలుడు సామాగ్రిని, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఎదురుకాల్పుల్లో పలువురు మావోయిస్టులు తప్పించుకోగా వారి కోసం కూబింగ్‌ ముమ్మరం చేసినట్లు ఎస్పీ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here