(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని సెప్టెంబర్ 25: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి పెద్దపల్లి జిల్లా ఏఆర్ సిబ్బందికి, హోంగార్డ్స్‌కి దర్బార్ శుక్రవారం నిర్వహించడం జరిగింది. ఈ దర్బార్‌ను పోలీసు కమిషనరేట్ ఆవరణలో ఏర్పాటు చేశారు. రామగుండం పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ ఆదేశాల మేరకు డిసిపి (అడ్మిన్) ఎం.అశోక్ కుమార్ దర్బార్ నిర్వహించారు.
అవసరాలు, సమస్యలను అడ్మిన్ అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది అడిగిన సిపిఒ సంబంధిత సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా చూస్తామన్నారు. ఎలాంటి సమస్య ఉన్న చెప్పవచ్చని అడ్మిన్ అశోక్‌కుమార్ తెలిపారు. ఎప్పుడైనా సమస్యలు చెప్పుకోవడానికి గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
ఏదైనా సమస్య ఉంటే వాట్సాప్ నెంబర్ 6301754817కు మెసేజ్ చేయవచ్చని అడ్మిన్ పేర్కొన్నారు. క్రమశిక్షణతో డ్యూటీ లను నిర్వర్తించాలని రామగుండం కమిషనరేట్‌కు పోలీస్ మంచిపేరు తీసుకురావాలన్నారు.బయట డ్యూటీస్‌కి వెళ్ళినప్పుడు క్రమశిక్షణతో, మంచి ప్రవర్తనతో విధులు నిర్వహిస్తే అధికారులు గుర్తిస్తారని అశోక్‌కుమార్ తెలిపారు. విధులలో నిర్లక్ష్యం చేస్తే శాఖపరమైన చర్యల తీసుకొవడం జరుగుతుందన్నారు.
ఈ దర్బార్‌లో అడిషనల్ డిసిపి (ఏఆర్) కమాండెంట్ సంజవ్, ఏసీపీ (ఏఆర్) సుందర్‌రావు, ఆర్‌ఐలు మధుకర్, శ్రీధర్, ఆర్‌ఎస్‌ఐ సంతోష్ పాల్గొన్నారు.