– టిబిజీకేఎస్ ఆర్‌జీ-1 వైస్ ప్రెసిడెంట్ గండ్ర దామోదరరావు
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, అక్టోబర్ 5: సింగరేణి కార్మికులకు ప్రమోషన్లు ఇప్పించిన ఘనత తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టిబిజీకేఎస్)కే దక్కుతుందని సంఘం ఆర్‌జీ-1 వైస్ ప్రెసిడెంట్ గండ్ర దామోదరరావు అన్నారు. టిబిజికెఎస్ పిట్ సెక్రెటరీ నాయిని శంకర్, అసిస్టెంట్ పిట్ సెక్రెటరీ సప్పీరి రామస్వామి అధ్యక్షతన సింగరేణి ఆర్‌జీ-1 ఏరియా జిడికె11 ఇంక్లయిన్‌లో సోమవారం గెేట్ మీటింగ్ జరిగింది. ఈ కార్యక్రమానికి టిబిజీకేఎస్ ఆర్‌జీ-1 వైస్ ప్రెసిడెంట్ గండ్ర దామోదరరావు, అప్పాల కష్ణ మూర్తి, దాసరి శ్రీనివాస్‌లు హాజరై మాట్లాడారు.
సింగరేణి చరిత్రలో 190, 240 మస్టర్స్ చేసిన వారికి 2 సంవత్సరాల లోపు జనరల్ మజ్దూర్‌గా ప్రమోషన్ ఇప్పించిన ఘనత కేవలం టిబిజీకేఎస్, టిఆర్‌ఎస్ ప్రభుత్వానికేే సాధ్యమైందన్నారు. జాతీయ సంఘాలు పని చేసిన కాలంలో ఏళ్ల తరబడి బదిలీ ఫిల్లర్‌గా, బదిలీ వర్కర్స్‌గా పనిచేసే వారని తెలిపారు. టిఆర్‌ఎస్ ప్రభుతం వచ్చాక టిబిజీకేఎస్ తుచా తప్పకుండా ప్రమోషన్స్ ఇప్పిస్తూ కార్మికులకు న్యాయం చేస్తుందన్నారు.
అదేవిధంగా ఆర్‌జీ-1లో మొత్తం 182 మందికి అందులో జీడికె 11లో 163 కార్మికులకు, జీడీకే 2 ఇంక్లయిన్ 17 మందికి. జీడికె 1 ఇంక్లైన్‌లో ఇద్దరికి నూతనంగా జనరల్ మజ్దూర్ గా ప్రమోషన్ వచ్చాయని పేర్కొన్నారు. ఇందుకు కృషి చేసిన మంత్రి కొప్పుల ఈశ్వర్, శాసన సభ్యులు కోరుకంటి చందర్‌లకు ఈ సందర్భంగా కతజ్ఞతలు తెలిపారు. నూతనంగా జనరల్ మజ్దూర్‌గా ప్రమోషన్ తీసుకున్న కార్మికులు సంతోషంగా టపాకాయలు కాల్చి, స్వీట్స్ పంపిణీ చేసి తమ ఆనందాన్ని వ్యక్తం చేసారు.
ఈ కార్యక్రమంలో టిబిజీకేఎస్ 11ఇంక్లైన్ పిట్ కమిటీ నాయకులు సమ్మయ్య, రాజేశం, దుర్గం తిరుపతి, సత్యనారాయణ రెడ్డి, దుర్గం శ్రీనివాస్, అంబటి శ్రీనివాస్, పల్లె సురేందర్, రాములు, భాస్కర్, మల్లయ్య, మల్లేష్, కుమార్, దేవేందర్, పరశురాములు, ప్రతాప్, లక్ష్మయ్య, గట్టయ్య, భాస్కర్, రమేష్, చంద్రమౌళి అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.