– సాదరంగా ఆహ్వానించిన బీజీపీ జిల్లా అధ్యక్షుడు సోమారపు సత్యనారాయణ
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, అక్టోబర్ 5: అంతర్గాం మండల బిజెపి అధ్యక్షుడు మాడ నారాయణరెడ్డి ఆధ్వర్యంలో పలువురు యువకులు బీజేపీలో చేరారు. ఈమేరకు సోమవారం బీజేపీ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలు, మోడి విధానాలను యువతను ఆలోచింప చేస్తుందన్నారు. దాంతో యువత బీజేపీవైపు మొగ్గు చూపుతుందని తెలిపారు. న్యూడెమోక్రసీ నాయకులు బొడ్డు కుమార్, హిందూ వాహిని నాయకులు ఆరుముళ్ళ శ్యామ్, మాడుగుల సతీష్ తదితరలు పార్టీలో చేరారు. బిజెపి మండల ప్రధాన కార్యదర్శి భూషిపాక సంతోష్ కుమార్, దళిత మోర్చా ప్రధాన కార్యదర్శి తుల్లా సతీష్ ప్రోత్సాహంతో పార్టీలో చేరినట్లు వారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి బోడకొండ సుభాష్, కార్యదర్శి జులా రాజేష్, దళిత మోర్చా మండల అధ్యక్షుడు నవీన్, యూత్ ప్రెసిడెంట్ మగ్గిడి సాగర్ పాల్గొన్నారు.