– జిల్లా కలెక్టర్ కె.శశాంక
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
కరీంనగర్, అక్టోబర్ 14: తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేసారు.
ప్రభుత్వం రెండు రోజులు సెలవులు ప్రకటిస్తూ జి.ఓ.ఆర్.టి.నెం. 1539 జారీ చేసింది. దాని ప్రకారం జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు, ప్రైవేటు సంస్థలకు మరియు బ్యాంకులకు బుధవారం, గురువారం రెండు రోజులు సెలవు దినాలుగా ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కె.శశాంక ఆ ప్రకటలో తెలిపారు. జిల్లాలో కురుస్తున్న వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రజలను కోరారు.