– జిడికె-1 సి.హెచ్.పి.లో స్వచ్చతా కార్యక్రమం
– ఎస్.ఈ (ఈ &ఎం) దాసరి శ్రీనివాస్
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, అక్టోబర్ 14: పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరు ప్లాస్టిక్ ను నిర్మూలించాలని జిటికె-1 సి.హచ్.పి. ఎస్.ఈ.(ఈఅండ్ఎం) దాసరి శ్రీనివాస్ అన్నారు. భారత ప్రభుత్వం ఆదేశానుసారం జాతిపిత మహాత్మా గాందీ 151 వ జన్మదినం సందర్బంగా నీరు, పారిశుధ్యం, పరిసారాలు పరిశుభ్రంగా ఉంచుట కొరకు స్వచ్చతా హి సేవా 2020 స్వచ్చతా మాసోత్సవాలు దేశ వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. అందులో భాగంగానే బుధవారం జిడికె-1 సి.హెచ్.పిలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్.ఈ. దాసరి శ్రీనివాస్ హజరై ఉద్యోగులచే స్వచ్చతా ప్రతిజ్ణ చేసి ప్రారంభించారు.
ఈ సందర్బంగా దాసరి శ్రీనివాస్ మాట్లాడుతూ… స్వచ్చతా హి సేవా ఒక గొప్ప కార్యక్రమం అని గాందీజి కళకు కన్న స్వచ్చమైన భారత దేశం నిర్మాణంలో స్వచ్చతా మాసోత్సవాలు ముఖ్య భూమికను పోషింస్తునదని తెలిపారు. దేశం మొత్తం స్వచ్చతా మాసోత్సవాలు నిర్వ హిస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ విధిగా తమ గృహాలను ఏ విధంగా అయితే శుభ్రంగా ఉంచుకుంటామో అదే విధంగా మన చుట్టూ ఉన్న పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరూ గుడ్డ సంచులను వాడాలని, పర్యావరణకు తమ వంతు భాద్యతగా ప్లాస్టిక్ వాడకాన్ని నిర్మూలించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఈ.ఈ. భూస శ్రీనాథ్, ఫిట్ సెక్రటరీ గుండు శ్రావణ్, నాయకులు పుట్ట రమేశ్, సేఫ్టీ అధికారీ శ్రీనివాస్ రావు, రాజేందర్, డి.వేణు, శ్రీనివాస్ రావు, రాపర్తి సమ్మయ్య, క్లారికల్ స్టాఫ్ జలపతి రెడ్డి, పోషమ్ ,శ్రీనివాస్, నరేందర్ అధిక సంఖ్యలో ఉధ్యోగులు పాల్గొన్నారు